ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అర్హులైన పోడు భూమి రైతులకు పోడు పట్టాలు ఇచ్చేందుకు సన్నద్ధం కావాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్ల ను సూచించారు.

ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం అర్హులైన  పోడు భూమి రైతులకు  పోడు పట్టాలు ఇచ్చేందుకు సన్నద్ధం కావాలని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం గిరిజనాభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా కలెక్టర్ల ను సూచించారు.  సోమవారం మధ్యాహ్నం రాష్ట్ర అటవీ పర్యావరణం, దేవాదాయ  శాఖ మంత్రి ఏ. ఇంద్రకరణ్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి తో కలిసి విడియో కాన్ఫరెన్స్ నుర్వహించి సూచనలు జారీ చేశారు.  ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ఎస్సి ఎస్టీ పోడు రైతులకు పోడు పట్టాలు ఇవ్వడమే కాకుండా నిబంధనల అనుసారం అటవీ ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పై ఉందన్నారు.  గ్రామ సభలు నిర్వహించి జిల్లా స్థాయి కమిటీకి పంపిన ప్రతిపాదనలను కలెక్టర్లు మరోమారు నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి అర్హులైన వారికి పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చేవిధంగా ఫిబ్రవరి 7 లోపు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ఎక్కువ మంది కి లాభం చేకూర్చే విధంగా చూడాలని మళ్ళీ పోడుకు అవకాశం లేకుండా అటవీ ప్రాంతాన్ని కాపాడేవిధంగా చూడాలన్నారు.

దేవాదాయ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న అర్హులకు పోడు పట్టాలు ఉచ్చి మళ్ళీ అటవీ జోలికి వెళ్లకుండా రాబోయే రోజుల్లో ఆటవికి ఎలాంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్లను కోరారు.  ప్రభుత్వం ఇప్పటికే జారీ చేసిన నిబంధనల మేరకు పోడు పట్టాలు ఉచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కంటివేలుగు, యపాధ్యాయుల పదోన్నతులు బదిలీలు, పామ్ ఆయిల్ తోటల సాగు పై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు.  కంటివేలుగు లో జిల్లాల నుండి వస్తున్న దూరపు చూపు కంటి అద్దాల రిపోర్టులు, తప్పు గా దిద్దినవి వస్తున్నాయని, మరికొన్నింటిలో ముఖ చిత్రాలు సరిగ్గా ఉండటం లేదని వాటిని సరి చేసి పంపాలని ఆదేశించారు.  అదేవిధంగా ఇలాంటి పొరపాట్లు తిరిగి జరుగకుండా  జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఉపాధ్యాయుల బదిలీలు నియమ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నుర్వహించేందుకు జిల్లా కలెక్టర్లు చొరవ తీసుకోవాలన్నారు.  ప్రావిజినల్ సీనియారిటీ జాబితా ప్రకటించి ఏమైనా అభ్యంతరాలు వస్తే పరిష్కరించాలన్నారు.  పదోన్నతి, బదిలీల ప్రక్రియ పూర్తి చేసి ఉత్తర్వులు మాత్రం విద్యా సంవత్సరం పూర్తి అయ్యేనాటికి జారీ చేయాలని సూచించారు.  ఫిబ్రవరి 1 నుండి మన ఊరు మన బడి మోడల్ పాఠశాలాలను ప్యారంభోత్సవం చేసుకునే విధంగా సిద్ధం చేసుకోవాలని సూచించారు.

ఆయిల్ పామ్ సాగు విషయంలో ఇప్పటి వరకు ఆయా జిల్లాలకు ఉచ్చిన లక్ష్యం మేరకు ఆయిల్ పామ్ తోటల సాగు పూర్తి చేయాలన్నారు.   ఆయ జిల్లాలలో జరుగుతున్న పనుల పై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఆదనవు కలెక్టర్ లోకల్ బాడీస్ మను చౌదరి మాట్లాడుతూ పొడుభూముల విషయంలో ఇప్పటికే ఎఫ్.ఆర్.సి గ్రామ సభలు నిర్వహించుకొని జిల్లా కమిటీ పరిశీలనలో ఉన్నాయని ఫిబ్రవరి, 7 లోగా అర్హులైన వారికి పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.   కంటివేలుగు లో ఎలాంటి సమస్యలు లేకుండా చూస్తామన్నారు. జిల్లాలో 50 బృందాల ద్వారా నేటి వరకు 48,763 మందికి కంటి పరీక్షలు పూర్తి చేయడం జరిగిందన్నారు.   ఉపాధ్యాయుల పదోన్నతి, బదిలీ విషయంలో సీనియారిటీ జాబితా సిద్ధం చేసుకొని ప్రదర్శించడం జరిగిందన్నారు.  మెడికల్ సర్టిఫికెట్ విషయంలో ప్రత్యేక మెడికల్ బోర్డు ద్వార పరిశీలన కార్యక్రమం పూర్తి చేయడం జరిగిందన్నారు.

ఆయిల్ పామ్ సాగు విషయంలో  2022-23 లో   3000 ఎకరాల్లో పామ్ ఆయిల్ సాగుకు నిర్దేశించటం జరిగిందని ఇప్పటికే 531 మంది రైతులు 2204 ఎకరాల్లో పామ్ ఆయిల్ సాగు ప్రారంభించడం జరిగిందన్నారు. మిగిలిన లక్ష్యం ఫిబ్రవరి, మార్చిలో పూర్తి చేయడం జరుగుతుందన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆదనవు కలెక్టర్ మోతిలాల్, డి.ఎఫ్.ఓ రోహిత్ రెడ్డి గోపిడి, జిల్లా వైద్య అధికారి డా. సుధాకర్ లాల్, డి.ఈ.ఓ గోవిందరాజులు, ఉద్యాన శాఖ అధికారి చంద్రశేఖర్, బి.సి. సంక్షేమ అధికారి అనిల్ ప్రకాష్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Share This Post