ప్రభుత్వ పంట నమోదు కార్యక్రమం మొదలైనది కావున జిల్లాలోని అన్ని మండలాలకు సంబంధించిన గ్రామాల రైతులు ప్రతి గుంట భూమిలో ఏ పంట ఉందో అనగా వ్యవసాయ, ఉద్యాన పంటలను సంబంధిత గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి(AEO) వద్ద నమోదు చేసుకోవాలి.

*పత్రిక ప్రకటన**

ప్రభుత్వ పంట నమోదు కార్యక్రమం మొదలైనది కావున జిల్లాలోని అన్ని మండలాలకు సంబంధించిన గ్రామాల రైతులు ప్రతి గుంట భూమిలో ఏ పంట ఉందో అనగా వ్యవసాయ, ఉద్యాన పంటలను సంబంధిత గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారి(AEO) వద్ద నమోదు చేసుకోవాలి. ముఖ్యంగా ఉద్యాన పంటలైన పండ్ల తోటలు( మామిడి, జామ, దానిమ్మ, బత్తాయి, సపోటా, నిమ్మ, నేరేడు, డ్రాగన్ ఫ్రూట్, సీతాఫలo, బొప్పాయి, అరటి, మొదలైనవి.) కూరగాయ పంటలను (టొమాటో, వంకాయ, బెండకాయ,పచ్చి మిర్చి, ఎండు మిర్చి, చిక్కుడు, గోరు చిక్కుడు, క్యాబేజీ, కాళీ ఫ్లవర్ , ఉల్లి గడ్డ, తీగ జాతి కూరగాయలు మొదలైనవి), పూల తోటలు (బంతి, చామంతి, గులాబీ, మల్లె) , పాలిహౌస్, షేడ్ నెట్ హౌస్స్ లను పంట నమోదు కార్యక్రమం లో నమోదు చేసుకొని ప్రభుత్వ పథకాల అమలుకు (డ్రిప్, ఇతర సబ్సిడీ పథకాలకు) అంతరాయం కలగకుండా చూడాలని కోరుతున్నాం. క్లస్టర్ AEO లు , అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఈ పంట నమోదులో ఉద్యాన పంటల నమోదులో రైతులతో సంప్రదించి సర్వే నెంబర్ వారీగా పంట నమోదును చేయాలని కొరడమైనది.

అలాగే సంబంధిత డివిజనల్ వ్యవసాయ సహాయ సంచాలకులు అందరూ పంటల నమోదు నిమిత్తమై సబందిత వ్యవసాయ అధికారులకు(AO’s) మరియు వ్యవసాయ విస్తరణ అధికారులకు (AEO) తగిన సూచనలు ఇవ్వవల్సిందిగా కొరడమైనది.

ఇట్లు.
యం. చంద్రశేఖరరావు
జిల్లా ఉద్యాన &పట్టు పరిశ్రమ అధికారి.
నాగర్ కర్నూల్ జిల్లా

Share This Post