ప్రభుత్వ పథకాలను ప్రజలకు తెలిపేందుకే రుణ విస్తరణ, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి, రుణాలు అందించడంలో బ్యాంకులు సానుకూల దృక్పథంతో వ్యవహరించాలి – జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్

వివిధ బ్యాంకులు, కార్పొరేషన్ల ఆధ్వర్యంలో స్టాళ్ల ఏర్పాటు

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను వివరించేందుకు రుణవిస్తరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ పీ ఉదయ్ కుమార్ తెలిపారు. గురువారం నాగర్ కర్నూల్ పట్టణంలోని సుఖ జీవన్ రెడ్డి గార్డెన్ లో దాదాపు 15 బ్యాంకులు తమ స్టాళ్లు ఏర్పాటు చేసి బ్యాంకులు ప్రజలకు ఇస్తున్న సదుపాయాలను వివరించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ ఉదయ్ కుమార్ పాల్గొని జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ….
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజల కు వివరించేందుకు జిల్లాలో ప్రప్రథమంగా రుణ విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అర్హులు రుణాలు పొంది లబ్ధిపొందాలని అన్నారు.
గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గార్లు ప్రజలకు బ్యాంకింగ్ రంగం ద్వారా మెరుగైన రుణాలు అందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని కలెక్టర్ తెలిపారు.
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి దళిత బంధు పథకం ద్వారా దళిత కుటుంబాలకు ఆర్థికపరమైన తోడ్పాటును అందించాలని నాగర్ కర్నూల్ జిల్లా లోని చారకొండ మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసి లబ్ధిదారుల అందరికీ 10 లక్షల రూపాయలతో పారిశ్రామిక రంగం గా అభివృద్ధి చెందేలా దళిత బంధు పథకంతో ప్రోత్సాహకాలు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చిన్న సన్నకారు వ్యాపారస్తులకు అనేక పథకాలను బ్యాంకుల ద్వారా అందించేలా కృషి చేస్తున్నారని తెలిపారు.
ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బ్యాంకులు అందించే అనేక రకాల రుణాలు పొందాలని అదేవిధంగా సకాలంలో రుణాలు బ్యాంకులకు చెల్లించి తోడ్పాటును అందించాలని సూచించారు.
రుణాలు అందించడంలో బ్యాంక్ అధికారులు లబ్ధిదారులకు అందించే రుణాల సందర్భంగా సానుకూల దృక్పథంతో వ్యవహరించి రుణాలు అందడం చడంలో 100% టార్గెట్ పూర్తి కావాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి 15 బ్యాంకులు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనడం సంతోషక రమని అన్నారు.
కలెక్టర్‌ అన్ని స్టాళ్లను పరిశీలించారు.
ముద్ర రుణాలతో పాటు ఇతర రుణాలపై కూడా అధికారులు అవగాహన కల్పిస్తారని తెలిపారు. డీజీఎం జి ఎన్ వి రమణ మాట్లాడుతూ బ్యాంకులు అందిస్తున్న సౌకర్యాలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో 15 శాఖల బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో ఎల్ డి ఎం కౌశల్, జిల్లా పరిశ్రమల అధికారి హనుమంతు పిడి డిఆర్డిఎ నరసింహారావు వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు బ్యాంక్ అధికారులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post