ప్రభుత్వ పథకాలపై క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించాలి:జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథo
తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్ర స్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని జిల్లా ప్రజా సంబంధాల అధికారి మామిండ్ల దశరథo తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులను అదేశించారు.
గురువారం IDOC లోని జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయంలో జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల తో DPRO సమావేశం నిర్వహించారు.
పేదల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా అనేక పథకాలను అందిస్తున్నారు. పథకాల సమాచారం ప్రజలకు చేరేలా చూడాలన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు నిర్దేశిత షెడ్యూల్ కు అనుగుణంగా ప్రచారం కార్యక్రమాలు క్రమం తప్పకుండా చేపట్టాలన్నారు. రోజువారీగా క్షేత్ర స్థాయిలో కళాకారుల చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి గ్రామ పంచాయితీ కార్యాలయం
ధ్రువీకరించిన పత్రాలు, ఫోటోలు హైదరాబాద్ లోని హెడ్ ఆఫీస్ తెలంగాణ సాంస్కృతిక సారథి హెడ్ ఆఫీస్ కార్యాలయం కు , అలాగే
జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయం కు పంపించాలని జిల్లా ప్రజా సంబంధాల అధికారి ఆదేశించారు.
ఈ సందర్భంగా కళాకారుల కోసం తెలంగాణ సాంస్కృతిక సారథి ప్రధాన కార్యాలయం అందజేసిన మొబైల్ సౌండ్ సిస్టం ను dpro కళాకారులకు అందజేశారు.
అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లాలో తెలంగాణ సాంస్కృతిక సారథులు గా విధులు నిర్వర్తించి కామారెడ్డి , జగిత్యాల జిల్లాకు బదిలీ అయిన కళాకారులను జిల్లా పౌర సంబంధాల అధికారి శాలువా, మెమెంటో తో సత్కరించారు.
——————————