ప్రభుత్వ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన తేదిః 20-12-2021
ప్రభుత్వ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, డిసెంబర్ 20:

ప్రభుత్వ పథకాల అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జిల్లాలో అమలు కాబడుతున్న ప్రభుత్వ పథకాల అధికారులు ప్రాధాన్యత ఇచ్చి పతకం అమలును విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. సోమవారం సాయంత్రం క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా అధికారులతో జూమ్ వెబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కన్వర్జేన్సి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,

పిఏసిఎస్, ఐకేపి, ప్యాక్స్ ద్వారా ఏర్పాటు చేసిన దాన్యం కోనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోళ్లను త్వరగా పూర్తిచేసి కేంద్రాలను మూసివేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోళ్లను పూర్తిచేసి త్వరగా కేంద్రాలను మూసివేయాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. కోనుగోలు చేసిన దాన్యం ట్యాబ్ ఎంట్రిలో అలస్యం జరుగుతుందని, ఎప్పటికప్పుడు ఎంట్రిలు పూర్తిచేయాలని, కేంద్రాలలో పనులు పూర్తికాని ప్రతి కేంద్రం వారిగా ఎపియంలతో డిఆర్డిఓ సమావేశాలను నిర్వహించి అలస్య జరగకుండా చూడాలని, ప్రతిరోజు ట్యాబ్ ఎంట్రి ని పర్యవేక్షిస్తానని, మీకు ఇచ్చిన లక్ష్యం పూర్తిచేయాలని పేర్కోన్నారు.
హరితహారం కార్యక్రమంలో బాగంగా నాటిన ప్రతిమొక్క సంరక్షించబడాలని, ప్రతిమొక్కకు సాసరింగ్, వాటరింగ్, ట్రిగార్డులను ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా అవసరమైన చోట మొక్కలను నాటాలని అన్నారు. జిల్లా ప్రవేశం నుండి చివరి వరకు మరియు జిల్లా మొదలుకొని పట్టణం, గ్రామం వరకు పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, మీడియం ప్లానిటేషన్ సక్రమంగా ఉండేలా ప్రత్యేకాధికారులు, యంపిడిఓలు, యంపిఓ లు ప్రధాన రహదారుల వెంట రోడ్డుకు ఇరువైపుల మొక్కల ప్రగతిని పరిశీలించడంతో పాటు, కాలినడన ప్రయాణం చేసి ప్లానిటేషన్ స్థితిగతులను పరిశీలించాలని అన్నారు.
జిల్లా ప్రభుత్వ పాఠశాలలో భోజనం సక్రమంగా లేకపోవడం వలన ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు చోటుచేసుకోవడం జరిగిందని, ఇలాంటివి మరోసారి పునరావృత్తం కాకుండా అన్ని వెల్పెర్ వసతి గృహల ప్రదానోపాధ్యాయుల, రెసిడెన్సి ప్రదానోపాద్యాయులు స్థానికంగా ఉండి జాగ్రత్తలు పాటించాలని, ఎవరైన నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది హెచ్చరించారు. ప్రతి వారంలో రెండు సార్లు జిల్లాలోని అన్ని పాఠశాలలను తనిఖీ చేసి, నివేధికను అందజేయాలని ఆదేశించారు.
నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న కట్టడాలను మొదటి దశలోనే గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవాలని, ప్రజావాణి కార్యక్రమాం ద్వారా వచ్చే ధరఖాస్తులపై చర్యలు తీసుకోవాలని, మొదటిదశ వ్యాక్సినేషన్ పూర్తిచేసి, రెండవ దశ వ్యాక్సిన్ సకాలంలో ఇవ్వడం డిసెంబర్ చివరిలోగా పూర్తచేసి, 100% వ్యాక్సినేషన్ పూర్తిచేసిన జిల్లాగా రూపుదిద్దాలని, అవసరం మేరకు RTPCR,ర్యాపిడ్ టెస్టులు చేయాలని అన్నారు.
ముందుస్తు కలెక్టర్ అనుమతి లేకుండా కార్యాలయాలలో తాత్కాళిక పద్దతిన సిబ్బంది నియమాకం రినివల్, ఎక్స్టెషన్, వంటివి చేపట్టరాదని ఆదేశించారు. క్రిస్మస్ పండుగ కొరకు ఏర్పాట్లు సక్రమంగా జరిగేలా చూడాలని
జిల్లాలోని ప్రారంభించనున్న దళితబందు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కొరకు అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉధ్యోగులుగా విధులు నిర్వహించి రిటైరు అయిన వారి నుండి, వివిధ స్వచ్చంద సంఘాలు మరియు యువత నుండి అవసరమైన సలహాలు, సూచనలు తీసుకోవాలని, ఒకే రకమైన లబ్దికాకుండా పథకానికి అర్హులైన లబ్దిదారులు బృందం ఏర్పడి లాబాసాటి వ్యాపారం, వ్యవసాయం, ఇతర రంగాలపై పెట్టుబడి పెట్టి లాబాలను ఆర్జించేలా లబ్దిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. అధికారుల అభిప్రాయాలను అడిగి తెలసుకున్నారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జె. అరుణశ్రీ, జగిత్యాల, కోరుట్ల ఆర్డిఓలు శ్రీమతి ఆర్.డి. మాదురి, టి. వినోద్ కుమార్, అన్నిశాఖల అధికారులు పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాలచే జారిచేయనైనది.

Share This Post