ప్రభుత్వ పాటశాలలో చదివే ప్రతి 3,4,5 వ తరగతులు చదివే విద్యార్థులందరికీ 45 రోజుల వర్క్ షీట్ భూమిక పుస్తకం అందెలా చూడాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

ప్రభుత్వ పాటశాలలో చదివే ప్రతి 3,4,5 వ తరగతులు చదివే  విద్యార్థులందరికీ 45 రోజుల వర్క్ షీట్ భూమిక పుస్తకం అందెలా చూడాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.

సోమవారం కల్లెక్టరేట్ సమావేశ హాలు నందు అదనపు కలెక్టర్ శ్రీ హర్ష మరియు జిల్లా విధ్యశాఖధికారి ఆధ్వర్యం లో తయారు చేసిన భూమిక 45 రోజుల వర్క్ షీట్ పుస్తకాన్ని కలెక్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా కారణంగా  సుమారు ఒకటిన్నర సంవత్సరం  నుండి పిల్లలు ఇంటికే పరిమితమయ్యారని, చాలా సమయం వృథాగా పోయిందని, పిల్లలు చదువుకోవడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుందని తెలిపారు. 3,4,5 వ తరగతుల విద్యార్థులు భూమిక వర్క్ షీట్ పుస్తకం ద్వారా తమ జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని అన్నారు. ప్రభుత్వ పాటశాలలో చదివే ప్రతి విద్యార్థికి ఈ పుస్తకం అందజేసి, పిల్లలు పుస్తకాన్ని చదివేలా వారిని ప్రోత్సహించాలని  విధ్యశాఖాధికారికి ఆదేశించారు.

సమావేశం లో అదనపు కల్లెక్టర్లు రఘురామ్ శర్మ, శ్రీ హర్ష,  అసిస్టెంట్ డైరెక్టర్ ఇందిర, తదితరులు పాల్గొన్నారు.

———————————————————————————-

జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాలగారి చే జారీ చేయడమైనది.

 

 

 

 

 

 

 

Share This Post