ప్రభుత్వ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీచేసిన జిల్లా కలెక్టర్ బి గోపి.

శనివారం వరంగల్ జిల్లాలోని గీసుకొండ, సంగెం మండలాలలోని ప్రభుత్వ పాఠశాలలను కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు.

గీసుకొండ మండలంలోని గంగదేవిపల్లి, సంగెం మండలంలోని హైస్కూల్ల ను కలెక్టర్ సందర్శించారు.

పాఠశాలలో శానిటేషన్, పరిసరాల పరిశుభ్రత విద్యార్థుల హాజరు శాతాన్ని కలెక్టర్ పరిశీలించారు.

విద్యార్థుల హాజరు తక్కువగా ఉన్నందుకు గల కారణలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం పాఠశాలలో అన్ని ఏర్పాట్లు చేశారని..ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలిపి పిల్లలను స్కూల్ కి తప్పక పంపేలా చూడాలని, పాఠశాలలో కూడా కోవిడ్ నియమ నిబంధనలు తప్పక పాటించాలని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచే విధంగా ఉపాధ్యాయులు తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

పాఠశాల ఆవరణలో పరిశుభ్రంగా లేకపోవడంపై ,పరిసరాలలో పిచ్చిమొక్కలు పెరగడం చూసిన కలెక్టర్…వెంటనే పంచాయతీ సిబ్బందితో పరిశుభ్ర పరచాలని D.E.O కి సూచించారు.

సంగెం మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి బృహత్ పల్లె పకృతి వనాన్ని కలెక్టర్ పరిశీలించారు.

అక్కడ నాటిన మొక్కలను చూసిన కలెక్టర్…మొక్కలను పద్ధతి ప్రకారం నాటాలని పల్లె ప్రకృతి వనం సుందరంగా తీర్చి దిద్దాలని సిబ్బందిని
ఆదేశించారు.

పనికి ఆహార పథకంలో పని చేసున్నటువంటి కూలీలలతో కలెక్టర్ మాట్లాడి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కూలీల పని దినాలను…. వారు చేస్తున్న పనిని అడిగి తెలుసుకున్నారు.

అక్కడినుండి గవిచర్ల గ్రామంలో ఏర్పాటుచేసిన పల్లె పకృతి వనాన్ని కలెక్టర్ పరిశీలించారు.

మొక్కలు బలంగా ఉన్నప్పటికీ…దూర దూరంగా మొక్కలు ఉన్నాయని…మధ్య మధ్యలో మొక్కలు నాటాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ హరి సింగ్ ,. తాసిల్దార్ లు విశ్వనారాయణ, సుహాసిని, ఎంపీడీవోలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post