పత్రికా ప్రకటన తేది: 4.09.2021
ప్రభుత్వ పాఠశాలలో అన్ని జాగ్రత్తలు తీసుకుని విద్యార్థులు పాఠశాలకు 100 శాతం హాజరయ్యేలా చూడాలని, జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
శనివారం గద్వాల్ మండలం పూడూరు, వీరాపురం గ్రామాలలోని ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. పాఠశాల ఉపాధ్యాయులు అందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని అన్నారు. పాఠశాల ఆవరణ, వంట గదులు, మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు శానిటైజర్ చేయాలని ,విద్యార్థులు మాస్కులు పెట్టుకొని వచ్చేలా చూడాలని, భౌతిక దూరం పాటిస్తూ తరగతులకు హాజరయ్యేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలన్నారు.
వర్షాకాల సమయంలో లో జలుబు దగ్గు జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులను గుర్తించి వెంటనే దగ్గరలో ఉన్న హెల్త్ సెంటర్ కు తీసుకెళ్ళి టెస్టులు చెయిoచి తగ్గిన తర్వాతనే స్కూల్ కి వచ్చే విధంగా చూడాలని అన్నారు. పాటశాల లో ఉన్న వంట గది ని పరిశీలించి విద్యార్థులకు భోజన వసతులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు మెనూ ప్రకారం వంటలు చెయ్యాలని వంట సిబ్బందికి సూచించారు. పాఠశాల పరిసర ప్రాంతాలలో శుభ్రంగా ఉంచుకోవాలని, పాటశాల మేనేజ్మెంట్ సమావేశాలు నిర్వహించాలని టీచర్లకు సూచించారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడుతూ తరగతులు ఏ విధంగా జరుగుతున్నాయి, కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులు విన్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వీరాపురం ప్రాథమిక పాఠశాల పక్కనే ఉన్న అంగన్వాడి సెంటర్ ను పరిశీలించి పిల్లలకు భోజనం మంచిగా చేసి పెట్టాలని చెప్పారు. అక్కడే ఉన్న నీటి సంపుని చూసి శుబ్రంగా ఉంచాలని హెడ్ మాస్టర్ కు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో హెడ్మాస్టర్లు పరమేశ్వర్ రెడ్డి, శాంతన్న,ఎంపీడీవో నాగ శేషాద్రి సూరి, ఎం ఈ ఓ సురేష్ , ఎంపిటిసి శంకర్ గౌడ్, మండల స్పెషల్ అధికారి వెంకటేశ్వర్లు , ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి జోగులాంబ గద్వాల గారి చే జారీ చేయబడినది.


