ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి విద్యాభివృద్ధిలో మార్పు తీసుకువచ్చేందుకు మన ఊరు మనబడికార్యక్రమం ప్రవేశ పెట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
శుక్రవారం జిల్లా కల్లెక్టరేట్ సమావేశం హాలు లో మన ఊరు, మన బడి కార్యక్రమం పై విద్యాశాఖ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, ఉపాధి హామీ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడతగా పైలట్ ప్రాజెక్టు కింద 24 పాఠశాలలను గుర్తించి 12 రకాల వసతులు కల్పించడం జరిగిందని ,వాటిలో మూడు పాఠశాలలు ప్రారంభించామని, మిగతా 21 పాఠశాలలకు సంబంధించిన పనులు త్వరలో పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలకు అవసరమయ్యే పనులను పెండింగ్లో ఉంచకుండా 100% పనులు పూర్తి చేయాలన్నారు. మిగతా పాఠశాలలలో ఇంకా ఏ ఏ పనులు మిగిలి ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ క్రింద పాఠశాలలలో చేపట్టిన పనులకు సంబంధించిన పూర్తి నివేదిక పంపాలన్నారు. జిల్లాలో 161 ప్రభుత్వ పాఠశాలలో 24 పైలెట్ ప్రాజెక్టులుగా గుర్తించిన పాఠశాలలోపనులు పూర్తి చేసి 3 స్కూల్స్ ప్రారంబించగా మిగతా 21 పాఠశాలల పనులు కాంపౌండ్ వాల్, కిచెన్ షెడ్, టైలెట్స్, రన్నింగ్ వాటర్, కలరింగ్ , అన్ని పనులు 100 శాతం పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. ఇంజనీర్లు , డి ఇ లు గ్రామాలలో సర్పంచ్ మరియు హెడ్మాస్టర్ లతో మాట్లాడి పనులు పూర్తి అయ్యేలా చూడాలన్నారు. జిల్లాలో టెండర్లు అయి అగ్రిమెంట్ చేసిన పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. మంజూరు అయి న సిసి రోడ్లు కు సంబంధించి పనులన్నింటిని పూర్తి చేయిoచాలని అధికారులకు ఆదేశించారు. అంగన్వాడీ భవనాలు, హెల్త్ సబ్ సెంటర్ పనులు ఎంతవరకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్, డిఇఓ సిరాజుద్దీన్, పంచాయతీరాజ్ డిఇ రవీందర్, వివేక్ కౌశిక్ , ఏఈలు తదితరులు ఉన్నారు.
—————————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల చేజారి చేయబడినది.