“ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్.”

ప్రచురణార్ధం

 సెప్టెంబరు, 22 ఖమ్మం:  –

ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యా బోధనతో పాటు విద్యార్థులకు రుచికరమైన పౌష్టిక ఆహారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మం జిల్లా మధిర పట్టణం పర్యటన సందర్భంగా పట్టణంలోని తేళ్ళ వసంతయ్య మెమోరియల్ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తణిఖీచేసారు. పాఠశాలలోని పదవ తరగతి ఇంగ్లీషు మీడియం క్లాసులో జరుగుతున్న ఇంగ్లీష్ సబ్బెక్టు బోధనను విద్యార్థులతో పాటు కూర్చోని కలెక్టర్ విన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ పదవ తరగతి విద్యార్థులకు ఇంగ్లీషు గ్రామర్ను బోధించారు. ఇంగ్లీష్ సబ్జెక్టులోని ప్రజంట్, పాస్ట్, ఫ్యూచర్ టెన్స్ బోధించిన అనంతరం ఉదాహరణతో సహా విద్యార్థులనుండి ప్రశ్నలు అడిగి జవాబులు తెలుసుకున్నారు. సుమారు అరగంటకు పైగా జిల్లా కలెక్టర్ 10వ తరగతి విద్యార్థులతో ఇంగ్లీష్ మీడియం క్లాసు తీసుకొని విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసారు. అనంతరం విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్నభోజనం చేసారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో ముచ్చటిస్తూ రోజువారీ మధ్యాహ్న భోజన ఏర్పాట్ల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

మున్సిపల్ చైర్పర్సన్ మెండితోక లత, మధిర తహశీల్దారు డి. సైదులు, ఎం.పి.డి.ఓ. విజయభాస్కర్ రెడ్డి, మండల విద్యా శాఖాధికారి వై ప్రభాకర్, పాఠశాల ఇంచార్జ్ హెచ్.ఎం యస్. వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమీషనర్ రమాదేవి, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post