ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 5వ,6వ,7వ తరగతుల విద్యార్థులకు ప్రత్యేక వేసవి శిబిరాలు – జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్

వేసవిలో నాగర్ కర్నూలు జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 5వ తరగతి నుండి 7వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఈ నెల 10వ తేదీ నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ప్రత్యేక వేసవి శిబిరాలు నిర్వహించనున్నట్లు నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి.ఉదయ్ కుమార్ ప్రకటించారు.
స్పెషల్ సమ్మర్ క్యాంప్ పేరుతో నిర్వహించే ఈ క్యాంప్.. మే 10 నుంచి 25 వరకు జరగనుంది.
బాలికలకు కల్వకుర్తి అక్షరవనంలో బాలులకు ఏకలవ్య గురుకుల పాఠశాల వెల్దండలో ప్రత్యేక వేసవి శిబిరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
వసతి మరియు భోజనం పూర్తిగా ఉచితంగా విద్యార్థులకు అందజేయనున్నారు.
ప్రత్యేక వేసవి శిబిరంలో భాగంగా విద్యార్థులకు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు.
ఇంగ్లీష్ లెర్నింగ్ స్కిల్స్, బాలసభ కార్యక్రమాలు, కోలాటం
ఏకాగ్రత, స్వీయ క్రమశిక్షణ, యోగాసనాలు, ధ్యాన నైపుణ్యాలు, నాయకత్వ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, ఆటలు, పాటలు, సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలు.. తదితర అంశాలు ఈ శిబిరంలో నేర్పించనున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా లోని ప్రభుత్వ పాఠశాలల్లో 5వ,6వ మరియు 7వ తరగతులు పూర్తి చేసుకున్న
ఆసక్తి గల బాలబాలికలు ఈనెల 9వ తేదీలోగా nagarkurnool.telangana.gov.in వెబ్సైట్ నందు విద్యార్థిని, విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

Share This Post