ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిఖిల…

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి అన్ని చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కొడంగల్ పట్టణం లోని ప్రభుత్వ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను సందర్శించి తయారు చేసిన అంచనాల ఆధారంగా చేపట్టానున్న పనులను కలెక్టర్ అధికారులతో కలసి పరిశీలించి పలు సలహాలు, సూచనలు జారీ చేసారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, పాఠశాలకు అవసరమైన 10 అదనపు తరగతి గదులను G+1 పద్దతిలో క్రింద 5 పై అంతస్తులో 5 గదులను నిర్మించాలని సూచించారు. భోజనశాలను పాఠశాల పాత భవనముపై నిర్మించాలని సూచించారు. ఉన్నత పాఠశాలకు, ప్రాథమిక పాఠశాలకు అవసరమైన పక్కా మరమ్మత్తులు చేపట్టాలన్నారు. మరుగుదొడ్లు, ప్రహరీ గోడల నిర్మాణం చేపట్టాలని సూచించారు. పాత కిచెన్ షెడ్ ను తొలగించి అదే స్థానంలో కొత్తగా నిర్మించాలన్నారు. అలాగే పాఠశాలలో కొత్తగా ఆకర్షనియమైన ఫ్లోరింగ్, తలుపులు, కిటికీలు అమర్చాలన్నారు. ప్రస్తుతం తయారు చేసిన అంచనాల నివేదికను కలెక్టర్ పరిశీలించి, ఎక్కువ డబ్బులు ఖర్చు చేయకుండా అంచనాల నివేదికను వెంటనే సవరించి కొత్త అంచనాల నివేదికను సమర్పించాలన్నారు. ప్రస్తుతం పాఠశాలలకు సెలవులు ఉన్నందున త్వరగా పనులు చేపట్టి పునఃప్రారంభం అయ్యే నాటికి అన్ని హంగులతో పాఠశాలను ఆధునికరించి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా విద్యా శాఖ అధికారి రేణుకదేవి, మండల స్పెషల్ ఆఫీసర్ విమల, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాంరెడ్డి, సహాయ ఇంజనీర్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post