ప్రభుత్వ పాఠశాలల, బాలికల గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన వసతులు కలిపించి, నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల, బాలికల గురుకుల పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన వసతులు కలిపించి, నాణ్యమైన భోజనం  అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష  అన్నారు.

 

బుధవారం గట్టు మండలంలోని తప్పెట్ల మోరుసు, గొర్లఖాన్ దొడ్డి , ఆరగిద్ద, పెంచికలపాడు, రాయపురం, గట్టు గ్రామాల పాఠశాలలను  తనిఖి చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలో  పరిసరాలను పరిశీలించి, బాలికల గురుకుల పాఠశాలకు సందర్శించి వంటశాల  పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలని వర్కర్లకు ఆదేశించారు. కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ భోజనం బాగుందా అని విద్యార్థులకు అడిగి తెలుసుకున్నారు ఆవరణలో ఎలాంటి చెత్త చెదారం ఉండకుండా పరిశుబ్రంగా ఉంచాలని, విద్యార్తుల హాజరు శాతాన్ని, మధ్యాహ్న భోజనం కు సంబందించిన రికార్డులను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటాలని, విద్యర్తులలో సీజనల్ వ్యాదులు ప్రబలకుండా తగు జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. మన ఊరు మన బడి పథకం ద్వారా చేపట్టిన పనులను  తనిఖీ చేశారు. తప్పెట్ల మరుసు, పెంచికలపాడు లో  మొక్కలు నాటారు. అనంతరం అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేసి గర్భిణీ స్త్రీలకు కోడిగుడ్లు ఇస్తున్నారా లేదా  అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు ఉదయాన్నే పనులకు వెళ్ళే  వారికి గుడ్లు బాక్స్ లో పెట్టి అందజేయాలని సూచించారు. గ్రామంలో మురుగు కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసి మురుగు నీరు పారే ప్రాంతంలో ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. ఆరగిద్ద గ్రామంలోని హెల్త్ సబ్ సెంటర్ పనులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి పనులను పరిశీలించారు. రాయపురం గ్రామంలో మన ఊరు మన బడి పనులను పరిశీలించి. ప్రధాన ఉపాధ్యాయులను విద్యార్థులు హాజరు శాతమును  అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గట్టులో బృహత్ పల్లె ప్రకృతి  వనాన్ని పరిశీలించారు.  గట్టు బృహత్ పల్లె  ప్రకృతి వనం 15 ఎకరాలలో 16 వేల మొక్కలు నాటమని సర్పంచు తెలుపగా బృహత్ పల్లె ప్రకృతి  వనం లో కలెక్టర్  మొక్కలు  నాటి నీళ్లు పోశారు. యెక్కడ గ్యాపు ఉందొ అక్కడ కూడా మొక్కలు నాటలని తెలిపారు.

అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. ఆసుపత్రికి  వచ్చే  రోగులకు డాక్టర్స్ అందరు  అందుబాటులో ఉండి  సరి అయిన వైద్య సేవలు  అందించాలని డాక్టర్లకు ఆదేశించారు. తదనంతరం  గట్టు తాసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను  పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో డిపిఓ శ్యాంసుందర్, ఎంపీడీవో చెన్నయ్య, తాసిల్దార్ సుందర్ , డిప్యూటి  ఈ ఈ రవీందర్, గ్రామాల సర్పంచులు ,  పంచాయతి సెక్రెటరి లు, పాఠశాల ఉపాద్యాయులు , తదితరులు పాల్గొన్నారు.

—————————————————————————             జిల్లా పౌరసంబంధాల అధికారి, జోగులాంబ గద్వాల్ గారి చే  జారీ చేయబడినది

Share This Post