ప్రభుత్వ పాఠశాలల లోనే మెరుగైన విద్య :::జిల్లా కలెక్టర్ గోపి

విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయల చేతుల్లోనే ఉంటుందని..వరంగల్ జిల్లా కలెక్టర్ బి.గోపి అన్నారు.

ఆదివారం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కలెక్టర్ ప్రసంగిస్తూ…ఈరోజు మీ అందరి ముందు కలెక్టర్ గా ఉండటానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు కృషి వల్లే అని కలెక్టర్ తెలిపారు.

నా విద్యాభ్యాసం ఒకటవ తరగతి నుండి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలోనే జరిగిందని అని కలెక్టర్ తెలిపారు.

సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టిన చోటనే నేను పుట్టడం అదృష్టమని కలెక్టర్ అన్నారు.

సమాజాభివృద్ధి కి తొలి మెట్టు పాఠశాల నుండే ప్రారంభం అవుతుందన్నారు.

ప్రతీ ఒక్క అధికారికి ఒక జాబ్ చార్ట్ ఉండాలని… దాన్ని క్రమశిక్షణగా పాటించాలన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో బోధించే ఉపాధ్యాయులు నిష్ణాతులని, వారు పూర్ణమైన జ్ఞానాన్ని కలిగినవారని.. ప్రభుత్వ ఉపాధ్యాయుల బోధన పరిపక్వంగా ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు.

ఒక పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అందరూ కలిసి పని చేస్తే ఆ పాఠశాలల్లోని విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థానాన్ని పొందుతారని కలెక్టర్ అన్నారు.

ఉపాధ్యాయులు చేసిన సేవలను వారు పదవి విరమణ పొందిన తర్వాత కూడా విద్యార్థులు గుర్తు చేసుకుంటారన్నారు

ఐఏఎస్ పూర్తి అయిన పిదప తమ గ్రామానికి వెళ్లి ఉపాధ్యాయులను కలిశానని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

విద్యార్థులను పాఠ్యపుస్తకాల పైనే కాకుండా ఇతర వ్యాపకాల్లో కూడా వారిని ప్రోత్సహించాలని కలెక్టర్ తెలియజేశారు.

విద్యార్థులు తప్పకుండా పుస్తకాల పఠనం పై ఆసక్తి పెంచేలా చేయాలని దానివల్ల భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు .

విద్యార్థిని విద్యార్థులు తప్పకుండా న్యూస్ పేపర్ చదివేలా చూడాలని ఉపాధ్యాయులను సూచించారు.

అవార్డు పొందిన ఉపాధ్యాయులందరికీ కలెక్టర్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ హరి సింగ్ జిల్లా విద్యాధికారి వాసంతి,30వ డివిజన్ రావుల కోమలి, ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post