ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో వనమహోత్సవము : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
తేది;10.8.2022, వనపర్తి.
     స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 10వ తేదీన వనమహోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష ఘనంగా నిర్వహించారు.
     బుధవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటి ఫ్రీడం పార్కును ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టాలని ఆమె సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 75వ స్వాతంత్ర్య వజ్రోత్సవాల వేడుకలను ఈ నెల 8వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని ఈ వేడుకలను అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో విజయవంతం చేయాలని ఆమె అన్నారు. 75వ భారత స్వాతంత్ర వజ్రోత్సవాలు భవిష్యత్తు తరాల వారికి గుర్తుండిపోయేలా ఘనంగా నిర్వహించాలని ఆమె తెలిపారు. పంచాయతీ రాజ్, అర్బన్ డెవలప్మెంట్, అటవీశాఖ ఆధ్వర్యంలో 265 ఫ్రీడమ్ పార్కులను ఏర్పాటు చేసి, 1,15.376 మొక్కలను నాటడం జరిగిందని ఆమె సూచించారు.
    ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష, జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ శాంగ్వాన్, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
…….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post