ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర హెరిటేజ్ అథారిటీ (రాష్ట్ర స్థాయి) మొదటి సమావేశం.

తెలంగాణ రాష్ట్ర హెరిటేజ్ అథారిటీ (రాష్ట్ర స్థాయి) మొదటి సమావేశం ఈరోజు బి.ఆర్.కె.ఆర్. భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ అధ్యక్షతన జరిగింది. జంట నగరాల్లోని 26 రక్షిత స్మారక చిహ్నాలు(Protected Monuments), కుతుబ్ షాహీ సమాధులు మరియు గోల్కొండ కోటకు సంబంధించిన Heritage సమస్యలపై కమిటీ చర్చించింది. రక్షిత స్మారక చిహ్నాలపై సంక్షిప్త స్టేటస్ నోట్ ఫోటోలతో సహ తయారు చేయాలని, తదుపరి చర్యల నిమిత్తం  తనిఖీ నివేదికను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు. Greater Hyderabad Heritage and Precincts Committee ముందు కుతుబ్ షాహీ టూంబ్స్ కోసం బఫర్ జోన్‌పై  రూపొందించిన డ్రాఫ్ట్ మార్గదర్శకాలను సమర్పించాలని కమిటీ కోరింది.ములుగు జిల్లాలోని పాలంపేట గ్రామంలోని కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) దేవాలయ అభివృద్ధి కోసం Integrated Conservation and Management Plan  సమర్పించాలని ప్రధాన కార్యదర్శి ఆదేశించారు.ఈ సమావేశంలో  మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి  శ్రీ అర్వింద్ కుమార్ , విద్యాశాఖ కార్యదర్శి శ్రీ సందీప్ కుమార్ సుల్తానియా, జి.హెచ్.యం.సి కమీషనర్ శ్రీ లోకేశ్ కుమార్, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ కార్యదర్శి శ్రీ కె.ఎస్.శ్రీనివాస రాజు, న్యాయ శాఖ కార్యదర్శి  శ్రీ సంతోష్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీ అమయ్ కుమార్ , ములుగు జిల్లా కలెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య, కులీ కుతుబ్ షాహి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి శ్రీ సంతోష్, TSTDC మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మనోహర్, GHMC చీఫ్ సిటీ ప్లానర్ శ్రీ దేవేందర్ రెడ్డి, పురావస్తు విభాగం అధికారి స్మిత మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Share This Post