ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులు అందించే రుణాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర పంచాయతీ మరియు గ్రామీణాభివృద్ధి సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు.
గురువారం సికింద్రాబాద్ లోని హరి హర కళాభవన్ లో రంగారెడ్డి జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులతో ఏర్పాటు చేసిన రుణ విస్తరణ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన గావించి రాష్ట్ర పంచాయతీ మరియు గ్రామీణభివృద్ధి శాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా సెక్రటరీ మాట్లాడుతూ వీధీ వ్యాపారులకు రుణాలు అందించడంలో దేశంలోనే మన రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందన్నారు. గత ఆర్ధిక సంవత్సరములో మహిళా సంఘాలకు బ్యాంకుల సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా రూ.10,000 కోట్ల రూపాయలు ఋణాలుగా అందచేయడము జరిగింది.
ఈ ఆర్ధిక సంవత్సరము 2021-22 లో రూ.12,000 కోట్లు ఋణాలు టార్గెట్ గా పెట్టుకొని ఇప్పటివరకు రూ.7,500 కోట్లు ఋణాలు అందచేయడం జరిగింది.
రంగారెడ్డి జిల్లాలో ఈ ఆర్ధిక సంవత్సరము 2021-22 ఆర్ధిక సంవత్సరములో 16,366 సంఘాలకు రూ. 572 కోట్లు ఋణాలు ఇప్పించుటకు టార్గెట్ పెట్టుకుని ఇప్పటి వరకు 6,375 సంఘాలకు రూ.274.00 కోట్లు ఋణాలు అందచేయడం జరిగింది.
కరోనా వలన ఆర్థికంగా గత రెండు సంవత్సరాల నుండి ఇబ్బందులు పడుతున్న వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలో పెద్ద ఎత్తున రుణ విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఈ చక్కటి అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగ పరచుకొని తమ వ్యాపారాలను అభివృద్ధి పరుచుకొని దేశాభివృద్ధికి తోడ్పడవలసినదిగా కోరారు.
అనంతరం వివిధ బ్యాంకులు ఏర్పాటుచేసిన స్టాల్ల్స్ ను తిలకించి ప్రారంబించారు.
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిక్ జైన్ మాట్లాడుతూ అన్నీ బ్యాంకుల వారు పూర్తి సహకారం అందించి వంద శాతం పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లాను రాష్ట్రంలో ముందు వరసలో ఉంచేందుకు కృషి చేయాలని బ్యాంకర్లను మరియు జిల్లా అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అమిత్ జింగ్రాన్, చీఫ్ జనరల మేనేజర్ ఎస్.బి.ఐ, జై బీప్ మిశ్రా, డి.జి.యం. ఎస్.బి.ఐ, శ్రీధర్ బాబు, డి.జి.యం. యు.బి.ఐ, రవి వర్మ, డి.జి.యం కెనరా బ్యాంకు, అమిత శ్రీవత్సల్, డి.జి.యం, యు.కో బ్యాంకు, రిజ్వాన్, ఎల్.డి.యం మరియు జంగారెడ్డి, అడిషనల్ డి.ఆర్.డి.ఒ తదితరులు పాల్గొన్నారు.