ప్రభుత్వ,  ప్రైవేటు రంగ బ్యాంకులు అందించే రుణాలను సద్వినియోగం చేసుకుని ప్రజలు ఆర్థికాభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

సోమవారం కొత్తగూడెం క్లబ్ లో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు నిర్వహించిన రుణ మేళా కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలనతో రుణ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రుణ మేళాకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి  కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ రుణాలు  పొందదానికి అవకాశం ఉందని చెప్పారు. తీసుకున్న రుణాలను  సద్వినియోగం చేసుకోవడంతో పాటు తిరిగి సకాలంలో చెల్లింపు చేయాలని చెప్పారు.  రుణాలు సకాలంలో చెల్లించడం వల్ల బ్యాంకు అభివృద్ధితో పాటు ప్రజలకు మరిన్ని రుణాలు అందచేయడానికి అవకాశం ఉంటదని చెప్పారు.  ఉపాధి యూనిట్లు ఏర్పాటు వల్ల ప్రజల  ఆర్థిక అభివృద్ధితో పాటు జిల్లా ప్రగతిపదంలో అభివృద్ధిలో ఉంటుందని చెప్పారు.    బ్యాంకులు సిబిల్ స్కోర్ ఆధారంగా రుణాలు మంజూరు చేస్తాయి  కాబట్టి ప్రతి  రుణాలు పొందిన ప్రతి ఒక్కరు  సకాలంలో చెల్లింపులు చేయాలని కోరారు.   రుణాలను మంజూరు చేసే పద్ధతులను ఉన్నటువంటి సంక్లిష్టత  తొలగించి సులువుగా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలని బ్యాంకర్లను కోరారు. సకాలంలో రుణాలు చెల్లింపు చేయడం వల్ల వడ్డీ రాయితీ కూడా లభిస్తుందని చెప్పారు. వరంగల్  భారతీయ స్టేట్ బ్యాంక్ డిజియం బాలానంద్ మాట్లాడుతూ వివిధ బ్యాంకులు అందిస్తున్న రుణ సదుపాయాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకుని మరియు అన్ని బ్యాంకులు కస్టమర్లకు రుణ సదుపాయాలు గురించి వివరంగా చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ రుణమేళాలో 15 బ్యాంకులు స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రజలకు రుణాలపై అవగాహన కల్పించి అర్హత కలిగిన వారికి వెంటనే రుణాలు మంజూరు చేశారు. ఎంపిక చేసిన అర్హులైన లబ్ధిదారులకు ఇంటి,  విద్యా, వ్యవసాయ రుణాలు అందించారు. అనంతరం 25 మహిళ స్వయం సంఘాలకు 2.50 కోట్ల రుణాల చెక్కును జిల్లా కలెక్టర్ పంపిణీ చేసి రుణ చెల్లింపు ప్రక్రియను తెలియ చేశారు.  723 మంది ఈ రుణ మేళాకు హాజరయ్యారని ఎల్డిఎం శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ బ్యాంక్ రీజినల్ మేనేజర్ కె. మహేశ్వర్, ఎల్డిఎం శ్రీనివాసరావు, మత్స్య శాఖ అధికారి వరదా రెడ్డి, AVGBV రీజినల్ మేనేజర్ శ్రీకాంత్, నాబర్డ్ DDM సుజిత్ కుమార్, GMDIC సీతారాం నాయక్ మరియు  అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

 

Share This Post