*ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులు, సిబ్బంది కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకుని ఉండాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులు, సిబ్బంది కోవిడ్ వ్యాక్సిన్ తప్పనిసరిగా తీసుకుని ఉండాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటించేలా చూడాలి*

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 12: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు, అందులో పని చేసే సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకుని ఉండాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో విద్య, వైద్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టర్ ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ మహమ్మారి ఇంకా ప్రపంచాన్ని వీడి వెళ్లలేదని, పాఠశాలలు, హాస్టళ్ళలో విద్యార్థులందరూ విధిగా మాస్కులు ధరించేలా చూడాలని, మహమ్మారి దరిచేరకుండా తగిన జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. మొదటి డోస్ తీసుకుని, రెండవ డోస్ కు అర్హులై కూడా ఇంకా తీసుకోని వారు వెంటనే రెండవ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు మొత్తం ఎంతమంది వ్యాక్సిన్ తీసుకున్నారు, ఎంత మంది తీసుకోలేదు అనే నివేదికను వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. భౌతిక దూరం పాటిస్తూ తరగతి నిర్వహించాలని అన్నారు. మధ్యాహ్న భోజన సమయంలో స్థల లభ్యతను బట్టి ఒకేసారి కాక తరగతుల వారీగా ఏర్పాట్లు చేయాలని ఆయన తెలిపారు. టాయిలెట్లు శుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. ఎవరికైనా విద్యార్థులకు జ్వరం, ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే సంబంధిత మెడికల్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకునేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సమీక్షలో జిల్లా విద్యా శాఖ అధికారి డి. రాధాకిషన్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డా. సుమన్ మోహన్ రావు, బీసీ సంక్షేమ అధికారి మోహన్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ అధికారి భాస్కర్ రెడ్డి, మైనారిటీ సంక్షేమ శాఖ ఓఎస్డీ సర్వర్ మియా, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post