ప్రభుత్వ , ప్రైవేట్ ఆసుపత్రులలో సహజ ప్రసవాలు పెరగాలి: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సహజ ప్రసవాలు పెరగాలి : జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ జయంతి

——————————

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సహజ ప్రసావాలను పెంచేలా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కృషి చేయాలనీ జిల్లా కలెక్టర్ శ్రీ అనురాగ్ ఆదేశించారు.

సోమవారం సాయంత్రం IDOC మీటింగ్ హల్ లో సహజ ప్రసవాలు పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం పై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

జిల్లాలో గత ఆర్థిక సంవత్సరం సిజేరియన్ ప్రసవాలు 68 శాతం జరుగగా, ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెలలో సుమారు 63 శాతం కు తగ్గిందన్నారు.

అనవసర C – సెక్షన్ లు చేయవద్దని చెప్పారు. సిజేరియన్‌ ప్రసవాలు సమాజానికి శ్రేయస్కరం కాదని, స్ర్తీల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని అంతేకాకుండా సిజేరియన్‌ ప్రసవాలతో పేదలపై ఆర్థిక భారం కూడా పడుతుందని అన్నారు. ప్రజలకు సాధారణ ప్రసవాలతో కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

రెండు రోజుల తర్వాత వైద్య ఆరోగ్య శాఖ కు సంబంధించి సమగ్ర సమీక్ష నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ముఖ్య పారామీటర్ లలో మరింత ప్రగతి కనబరిచేలా కూలంకషంగా చర్చిద్దామని చెప్పారు. ఉన్న వనరుల నే సద్వినియోగం చేసుకుంటూ పనితీరు మెరుగు పరుచు కోవాలన్నారు. ఈ హెల్త్ ప్రొఫైల్ వేగంగా పూర్తి చేసేందుకు అవసరమైతే అదనపు సిబ్బందిని సమకూర్చుకోవాలని జిల్లా వైద్యాధికారి కి జిల్లా కలెక్టర్ సూచించారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కు మెడికల్ కళాశాల మంజూరు చేసిన దృష్ట్యా నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించాలని జిల్లా కలెక్టర్ ఆర్డిఓ శ్రీనివాసరావు ను ఆదేశించారు.

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ బి సత్య ప్రసాద్, జిల్లా వైద్యాధికారి డా. సుమన్ మోహన్ రావు, డిప్యూటీ డీఎంహెచ్ఓ శ్రీ రాములు సిరిసిల్ల, వేములవాడ జిల్లా ఆసుపత్రుల సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మురళీధర్‌రావు, డాక్టర్‌ మహేష్‌రావు, సర్వేలెన్స్‌ అధికారి డాక్టర్‌ మీనాక్షి,
ఇమ్మ్యూనైజేషన్ అధికారి డా. మహేష్, పీఓ లు డా. కపిల్, డా. శ్రీరాములు, డా. రాజశేఖర్, హెల్త్ ప్రొఫైల్ పీఓ లు నందిత, శ్రీధర్, హెచ్ఇ కార్తిక్, తదితరులు పాల్గొన్నారు.

——————————

Share This Post