ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి: జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్

ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి

జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్

0000

ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ డాక్టర్లను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సాధారణ ప్రసవాలపై ప్రైవేట్ గైనకాలజిస్టులు, ప్రభుత్వ ఆసుపత్రి ఎం.సి.హెచ్. కరీంనగర్, హుజురాబాద్ గైనకాలజిస్టులు మరియు పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డెలీవరీలు ఆపరేషన్ కు బదులుగా సాధారణ ప్రసవాలను పెంచుటకు తమ వంతు ప్రయత్నం చేయాలాని డాక్టర్లకు కలెక్టర్ సూచించరు. ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ప్రైవేట్ ఆసుత్రులకు ధీటుగా పనిచేస్తున్నాయని తెలిపారు. గర్భిణీ అయినప్పటి నుండి బీ.పీ., షుగర్, రక్త పరీక్షలు ఎప్పటికప్పుడు చేయాలని అన్నారు. గ్రామాలలో అంగన్ వాడీ వర్కర్లు, ఏ.ఎన్.ఎం.లు సమన్వయంతో పనిచేసుకోవాలని తెలిపారు. గర్భీణీ స్త్రీలకు ప్రభుత్వ ఆసుపత్రులల్లో సాధారణ డెలీవరీ అయ్యే విధంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ డాక్టర్లు డెలీవరీలు నార్మల్ అయ్యే విధంగా దృష్టి పెట్టాలని వైద్యులను ఆదేశించారు. నోటి క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారిని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు చెక్ చేసి అన్ని సౌకర్యాలు ఉన్న ఆసుపత్రికి పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆసుపత్రులలో వచ్చిన్ పేషెంట్లకు ట్రీట్ మెంట్ విషయంలో జాప్యం కాకుండా సరియైన్ సమయంలో అందించాలని ఆదేశించారు.

పోషణ్ అభియాన్ లో భాగంగా గ్రామీణ ఆరోగ్య పోషణకు సంబంధించి ప్రజలకు అవగాహన కలిగే విధంగా ఆశా వర్కర్లు, అంగన్ వాడీ టీచర్లు అన్ని గ్రామాల్లో ప్రతి మంగళవారం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జువేరియా, డిప్యూటి డి.యాం.అండ్ హెచ్.ఓ డాక్టర్ సుజాత, ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ సాజిద, మాతా శిశు సంరక్షణ కేంద్రం ఆసుపత్రి ఆర్.ఎం.ఓ.డాక్టర్ జ్యోతి, డాక్టర్ అలీం, వైద్యాధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ గైనకాలజిస్టులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post