ప్రచురణార్థం
ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటాం…
మహబూబాబాద్ మార్చి 20.
ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే సహించేది లేదని తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని మహబూబాబాద్ తాసిల్దార్ నాగ భవాని అన్నారు.
సోమవారం మున్సిపల్ పరిధిలోని ఐ డి ఓ సి కవిత కాలనీ లోని 255 సర్వే నెంబర్ లో పలువురు గుడిసెలు వేసుకునేందుకు రాగా ఆక్రమణలను తొలగించడం జరిగిందన్నారు.
ఇకముందు కూడా ప్రభుత్వ భూములను ఆక్రమించి ఇండ్లు నిర్మిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.