ప్రభుత్వ భూములను, ఆస్తులను గుర్తించి జియో ట్యాగ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. హరిత తెలిపారు.

శుక్రవారం వరంగల్ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తహసిల్దార్లు సర్వేయర్లు లతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలోని అన్ని ప్రభుత్వ శాఖల భూములను ప్రభుత్వ ఆస్తులను రికార్డ్ చేసి జియో ట్యాగింగ్ చేయాలని కలెక్టర్ అన్నారు సర్వేయర్లు కేటగిరీల వారీగా సర్వే చేసి రికార్డు సమర్పించాలన్నారు .

ఈ జియో ట్యాగింగ్ పక్రియ అక్టోబర్ నెల కల్లా పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. సర్వేయర్లు తాసిల్దార్ లు ఈ పక్రియ వర గా పూర్తి చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకోవాలన్నారు . మండలాల వారీగా ప్రతి వారం మానిటరింగ్ చేస్తాను కలెక్టర్ తెలియజేశారు. సర్వేయర్లు ఈ కార్యక్రమాన్ని చాలా జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. తాసిల్దార్ లు తమ కార్యాలయ బోర్డులు వరంగల్ జిల్లాగా పేరును మార్చుకోవాలని సూచించారు. మండలాల వారీగా ధరణి లో పెండింగ్లో ఉన్న దరఖాస్తుల వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ ల్ ఆర్డిఓ మహేందర్ జి నర్సంపేట ఆర్డిఓ పవన్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post