ప్రభుత్వ భూములు ఆక్రమణ చేసి ఇండ్ల నిర్మాణాలు చేపట్టిన వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలు నందు అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి నిర్వహించి ప్రజల నుండి సమస్యల వినతులను స్వీకరించారు. భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను తక్షణం ధరణి యాప్లో పరిశీలించారు. భూ సమస్యను పరిష్కరించేందుకు ధరణియాప్లో దరఖాస్తులు చేయాలని. చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగూడెం మున్సిపాల్టీలో ప్రభుత్వ భూమిలో ఇండ్ల నిర్మాణం చేపడుతున్నారని మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ చేసిన ఫిర్యాదును పరిశీలించిన కలెక్టర్ తక్షణం కూల్చివేత చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీన భద్రాచలంలో ముక్కోటి ఏర్పాట్లుపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నందున గత సమావేశంలో అధికారులకు అప్పగించిన పనులపై కార్యాచరణ నివేదికలతో హాజరుకావాలని చెప్పారు. మధ్యాహ్న భోజన నిధులు చెల్లింపు ప్రక్రియపై నివేదికలు అందచేయాలని డిఈఓకు సూచించారు. అన్నపురెడ్డిపల్లి మండలంలో జూనియర్ కళాశాల ఏర్పాటుకు గల అవకాశాలు కల్పనపై తక్షణం నివేదికలు. అందచేయాలని డిఈఓకు, ఆర్ఐఓకు సూచించారు. యాస్పిరేషన్ నివేదికలు మంగళవారం వరకు అందచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు కొన్ని:: పాల్వంచ మున్సిపార్టీకి చెందిన సిహెచ్ జగన్మోహన్ రావు మరికొందరు పరిధిలోని గట్టాయిగూడెం బ్యాంక్ కాలనీ నుండి ఒడ్డుగూడెం వెళ్లే రోడ్డు లో సుమారు 60 మీటర్లు మట్టి రోడ్డు కలదని, వర్షాకాలం చాలా ఇబ్బందులు: పడుతున్నామని చేసిన దరఖాస్తును తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మున్సిపల్ కమిషనర్క ఎండార్స్ చేశారు. చుంచుపల్లి మండలం, రుద్రంపూర్ ఏరియాకు చెందిన జి. యాకయ్య మరికొందరు రుద్రంపూర్ గ్రామంలో 140 కుటుంబాల వారం ఉంటున్నామని, సింగరేణి అధికారులు వెంకటేష్ ఖని ఉపరితల గని ఏర్పాటు చేస్తున్నామని.. పునరావాసం కల్పించు విధంగా చర్యలు తీసుకోవాలని చేసిన ఫిర్యాదుపై జియం సమగ్ర నివేదికలు అందచేయాలని ఎండార్స్ చేశారు. కొత్తగూడెం మండల సన్యాసిబస్తీకి చెందిన సిహెచ్ రమణ తన భర్త మరణించారని, తాను వికలాంగురాలినని జీవనోపాధి కొరకు కూరగాయలు విక్రయించేందుకు రైతుబజార్లో దుకాణం కేటాయించాలని చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ వీధి వ్యాపారుల రుణంతో పాటు తనకు దుకాణం కేటాయించాలని మున్సిపల్ కమిషనరుక్కు ఎండార్స్ చేశారు. అన్నపురెడ్డిపల్లి మండలం, గ్రామానికి చెందిన చల్లా పుల్లయ్య అన్నపురెడ్డిపల్లి మండలంలో ప్రభుత్వ సముదాయాలు నిర్మాణానికి సర్కారు బంచరాయి భూమి ఉన్నదని, భూమి చూపకపోవడం వల్ల మండాలనికి మంజూరైన ప్రభుత్వ సముదాయాలు ఇతర మండలాలకు తరలివెళ్లే అవకాశం ఉన్నదని, స్థల కేటాయింపులు చేయాలని చేసిన దరఖాస్తును తగు చర్యలు నిమిత్తం ఆర్డీఓకు ఎండార్స్ చేశారు. ఖమ్మం పట్టణం, తుమ్మలచెరువుకు చెందిన ఎస్కే హుస్సేన్ బీ తనకు పాల్వంచ మండలం పాండురంగాపురం గ్రామ పరిధిలోని సర్వే నెం. 126/145 నందు 8.05 కుంటల వ్యవసాయ భూమి తన తండ్రి 1964 సంవత్సరంలో చేరుకుమల్ల నర్సయ్య వద్ద క్రయం పొందారని, తన భూమికి పట్టాదారు పాసుపుస్తకంతో పాటు రైతుబంధు మంజూరు చేయాలని చేసిన దరఖా పరిశీలించిన కలెక్టర్ నివేదిక అందచేయాలని ఆర్డీఓకు ఎండార్స్ చేశారు. ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డీ అశోకచక్రవర్తి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post