ప్రభుత్వ భూములు ఆక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు….. తహసిల్డార్ నాగభవాని. ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలు తొలగించిన తహశీల్దార్

ప్రభుత్వ భూములు ఆక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు….. తహసిల్డార్ నాగభవాని.  ప్రభుత్వ భూమిలో నిర్మించిన అక్రమ కట్టడాలు తొలగించిన తహశీల్దార్

మహబూబాబాద్, ఏప్రిల్ -27:

స్థానిక నూతన కలెక్టరేట్ కార్యాలయ సముదాయం దగ్గర, ఈ.వి.ఎం. గోడౌన్ ప్రక్కన గల ప్రభుత్వ భూమిలో కట్టిన అక్రమ కట్టడాన్ని మహబూబాబాద్ తహశీల్దార్ నాగాభవాని బుధవారం తొలగించారు.

అలాగే, సర్వే నంబర్ 255 లోని ప్రభుత్వ భూమి, దాని ప్రక్కన భూమి సర్వే నంబర్లకు మధ్యలో ట్రెంచ్ ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రభుత్వ భూమి పక్కన ఉన్న పట్టాదారులు ఎవరు కూడా ప్రభుత్వ భూమిని ఆక్రమించ రాదని, ట్రెంచ్ దాటి వచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Share This Post