ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ జీవో నెంబర్ 58,59 ప్రకారం సర్వే పనులను వేగవంతం చేయాలీ – జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ జీవో నెంబర్ 58,59 ప్రకారం సర్వే పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ సంబంధిత టీముల అధికారులను ఆదేశించారు.

శుక్రవారం జీవో నెంబర్ 58 ప్రకారం సర్వేలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని గోపీనగర్ కాలనీని జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి ఆక్రమిత భూములలో నిర్మించిన ఇండ్లను పరిశీలించారు. జి. ఓ. నం.58 అనుసరించి ఇంటి పట్టాలు ఇవ్వాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్న నేపధ్యంలో అట్టి ఇండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో జీవో నెంబర్ 58,59 ప్రకారం నివాసం ఉన్న వారిని గుర్తించడానికి జిల్లాలో 40 టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ టీములలో ఉన్న అధికారులు జిల్లాలో విస్తృతంగా తిరిగి ప్రభుత్వ భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న వారిని గుర్తిస్తారని తెలిపారు. జీవో ప్రకారం సరైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని వారికి సూచించారు.

ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్ రెడ్డి, తాసిల్దార్ వంశీ మోహన్, సర్వేయర్, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post