ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన
23 7 2022
వనపర్తి

వనపర్తి ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను  త్వరగా అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా తో కలిసి కళాశాల నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
నాలుగు నెలలలో నర్సింగ్ కళాశాల నిర్మాణం
పూర్తి చేయాలన్నారు.
తుదిదశకు కళాశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు.
కళాశాలలో
ఐదు ల్యాబ్ లు, రెండు లెక్చర్ హాళ్ల నిర్మాణం పూర్తి
అయిందని
ప్రస్తుతానికి ఇందులో మెడికల్ కళాశాల ఏర్పాటు
చేస్తున్నట్లు తెలిపారు.
అనంతరం మెడికల్ కళాశాల భవనం నిర్మాణం
పరిశీలించారు
మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణకు అనుగుణంగా భవనాలు సిద్దం
చేస్తున్నట్లు తెలిపారు.
అనుమతులు పూర్తయిన వెంటనే ఎంసెట్ కౌన్సిలింగ్ లో వనపర్తి మెడికల్ కళాశాల ఎంపిక చేసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు.
విద్యార్థులు వచ్చే వరకు పూర్తి స్థాయిలో కళాశాల, వసతిగృహాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
వనపర్తి మెడికల్ కళాశాల క్యాంపస్ మిగతా కళాశాలలకు ఆదర్శంగా నిలుస్తుంది
అని,
ఇక్కడ చదువుకునే విద్యార్థులు అదృష్టవంతులు అనడంలో సందేహం లేదు అని మంత్రి తెలిపారు.
విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి అన్నివిధాలా అనుకూల వాతావరణం ఉందని అన్నారు.
భవన నిర్మాణానికి కృషిచేసిన అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బందికి మంత్రి అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ ఆశిష్ సంగవాన్, అదనపు కలెక్టర్ వేణు గోపాల్, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, డాక్టర్ లు మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్ లు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

…………………
జిల్లా పౌర సంబంధాల అధికారి వనపర్తి జారీ చేయబడినది.

Share This Post