* ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ద్వారా నూతనంగా తయారు చేసిన కాంపోజిట్  ఐదు,పదికిలోల సిలిండర్ల జారీ

హుజురాబాద్

మే 7,శనివారం.

* ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ద్వారా నూతనంగా తయారు చేసిన కాంపోజిట్  ఐదు,పదికిలోల సిలిండర్ల జారీ*ప్రభుత్వ రంగ ఇండియన్ అయిల్ కార్పోరేషన్   మారుతున్న వంటింటి అవసరాలకు అనుగుణంగా ఇండేన్ వాడకందారులు సులభంగా వినియోగించే కాంపోజిట్ సిలిండర్లు అందుబాటులోకి తెచ్చాయని ఐఓసియల్ రామగుండం విక్రయ అధికారి అలోక్ రెడ్డి, హుజురాబాద్ అంబుజా గ్యాస్ మేనేజింగ్ పార్టనర్ పి.వి.మదన్ మోహన్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు .2.0 కాంపోజిట్ సిలిండర్ కొన్ని ప్రత్యేక లక్షణాలతో రూపొందించబడిందని తేలికైన బరువుతో పాటు తక్కువ ఖర్చుతో లభిస్తుందని వారు వివరించారు.ప్రస్తుతం వాడే సాంప్రదాయ ఇండేన్ సిలిండర్ కన్న తక్కువ బరువుతో లభించే కాంపోజిట్ సిలిండర్లో ఎంత గ్యాస్ వుందో తెలుసుకోవచ్చని,లోహపు సిలిండర్ కానందువల్ల సిలిండర్ తాలుకు తప్పు మరకలు నేలపై కనపడవని వారు వివరించారు.పేలుడు నుండి రక్షణ యు.వి.ప్రొటక్షన్ తో చుట్టబడిన పైబర్తో తయారు చేయబడ్డాయని వారు పేర్కన్నారు.హచ్.డి.పి.ఈ‌.ఔట్లెట్ సాకెట్ తో  బిగించబడి వుంటుంది.ఐదు మరియు పది కిలోల పరిమాణంలో   ప్రజలకు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.నూతనంగా మార్కట్లొకి విడుదలైన  పదికిలోల కాంపోజిట్ సిలిండర్ డిపాజిట్ ₹ 3350/- తో పాటు రీఫిల్ ధర  770.50 రూపాయలని అలోక్ రెడ్డి,మదన్ మోహన్ తెలిపారు.వివిధ ఇండేన్ ఏజన్సీలలో నమోదు కాబడిన కస్టమర్లు ఇండేన్ కాంపోజిట్ సిలిండర్ కొరకు ఆసక్తి కనపరిస్తే వారు తమ వద్దవున్న 14.2 కిలోల సిలిండర్లు సంబంధిత ఏజన్సీకి అప్పగించి పాత సిలిండర్ డిపాజిట్ మినహాయింపు పొంది మిగితా డిపాజిట్ మరియు రీపిల్ సిలిండర్ ధరను చెల్లించి కాంపోజిట్ సిలిండర్ పొందవచ్చని తెలిపారు.అదే విధంగా కాంపోజిట్ సింగిల్  సిలిండర్తో నూతన కనెక్షన్లు పొందేవారు 4485 డిపాజిట్ రీఫిల్ ఇతర చార్జీలు చెల్లించాలని స్టౌ కొరకు అదనపు చార్జీలు యంఆర్పి రేటు ప్రకారం చెల్లించాలని తెలిపారు.హైదరాబాదు జంటనగరాలలో లభ్యమయ్యే ఈ సిలిండర్లను వివిధ ఇండేన్ గ్యాస్ డీలర్ల ద్వారా అందుబాటులోకి తెచ్చామని‌ అలోక్ రెడ్డి,మదన్ మోహన్ ఆ ప్రకటనలో తెలిపారు.

Share This Post