ప్రభుత్వ రుణాలు మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలి : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

జిల్లాలో మహిళా సంఘాలకు ప్రభుత్వం అందిస్తున్న రుణాలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన మహిళా సంఘాల జిల్లా స్థాయి సమావేశానికి జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్ద్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళల స్వయం సమృద్ధి కోసం ప్రభుత్వం సంఘాలకు రుణ సదుపాయం కల్పిస్తుందని, ఈ రుణాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని, స్త్రీనిధి పథకం క్రింద ఇచ్చిన రుణాలను సరైన విధంగా వినియోగించుకోవాలని తెలిపారు. మహిళా సంఘాల సభ్యులకు అవసరమైన రుణాలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని, ఒమిక్రాన్‌ వేరియంట్‌ వైరస్‌ వ్యాప్తి వేగంగా ఉన్న నేపథ్యంలో మహిళా సంఘాల సభ్యులు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్ము ధరించడంతో పాటు, భౌతిక దూరం పాటించాలని, గ్రామీణ స్థాయిలో మహిళా సంఘాలు కొవిడ్‌ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కృషి చేయాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి మనోహర్‌, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి సురేందర్‌, మహిళా సంఘాల సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post