*ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు కృషి చేయాలి::అదనపు కలెక్టర్ వి.చంద్రశేఖర్*

*ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు కృషి చేయాలి::అదనపు   కలెక్టర్   వి.చంద్రశేఖర్*
• *ఆర్థిక అక్షరాస్యత   పెంపొందించే దిశగా ప్రత్యేక క్యాంపుల నిర్వహణ*
• *రైతు రుణాలను రెన్యూవల్ చేసుకునేలా అవగాహన కల్పించాలి*
• *బ్యాంకర్లతో 2వ త్రైమాసిక డిసిసి, డిఎల్ఆర్సి  సమావేశం  నిర్వహించిన అదనపు  కలెక్టర్*
నల్గొండ, నవంబర్ 5:-    ప్రభుత్వ లక్ష్యాల సాధనకు  బ్యాంకర్లు  పూర్తి స్థాయిలో కృషి చేయాలని అదనపు కలెక్టర్  వి.చంద్రశేఖర్ కోరారు. రైతు పంట రుణాలు, ఎస్సి ఎస్టీ కార్పోరేషన్ ల రుణాలు,  ఆర్థిక అక్షరాస్యత, ఇతర   అంశాల పై   శుక్రవారం  డి.సి.సి, డి.ఎల్.ఆర్.సి 2వ త్రైమాసిక సమీక్షా సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు.  గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, దానికి సంబంధించిన పురొగతి తదితర అంశాల ను  లీడ్ బ్యాంక్ మేనేజర్ సూర్యం వివరించారు.
వ్యవసాయ రంగానికి సంబంధించి  2021-22 వానాకాలం పంటకు గాను జిల్లాలో 2308 కోట్ల రూ.లు లక్ష్యంగా నిర్ణయించగఓ మొదటి త్రైమాసికం సెప్టెంబర్ 30  వరకు 1832.09 కోట్ల రూ.లు  అందించి 79.38 శాతం లక్ష్యం సాధించినట్లు తెలిపారు.జిల్లా వార్షిక రుణ ప్రణాళిక వివిధ రంగాలకు 7303.57 కోట్ల రూ.లు లక్ష్యం గా నిర్ణయించగా సెప్టెంబర్ 30 నాటికి 3603.64 కోట్ల రూ. లు 49.34 శాతం వివిధ రంగాలకు రుణ సహాయం అందించినట్లు తెలిపారు.  రూ.485 కోట్ల 34 లక్షల రూ.లు వ్యవసాయ టర్మ్  రుణం మంజూరి చేయడం లక్ష్యం  కాగా   సెప్టెంబర్ చివరి వరకు రైతులకు  రూ.239 కోట్ల 66  లక్షల రూ.లు(49.38%)  రుణాలు  రైతులకు అందించామని ,వ్యవసాయ అనుబంధ రంగాలకు 1523కోట్ల 53 లక్షల రూ.లు అందించాలని లక్ష్యం కాగా 663 కోట్ల 80 లక్షల రూ.లు  (43.57%) అందించినట్లు అధికారులు  తెలిపారు. రైతులకు  రుణ లక్ష్యాలు చేరుకోవడంలో  మరింత పురొగతి సాధించాల్సి ఉందని,   రైతులు తమ  రుణాలను రెన్యూవల్ చేసుకునే అంశం  పై వారికి అవగాహన కల్పించాలని  తెలిపారు.  రైతులకు రుణాలు మంజూరు లక్ష్యాల చేరుకోకపోవడం పై బ్యాంకుల వారిగా కలెక్టర్ సమీక్షించారు.
*రైతులు పంట రుణాలు రెన్యువల్ చేసుకోవాలి*
రైతులు  పంట రుణాలను బ్యాంక్ లలో రెన్యువల్ చేసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు.పంట రుణాలు రెన్యువల్ చేసుకోకపోవడం వలన వడ్డీ  చెల్లించి రావడం నష్టం జరుగుతుందని,రెన్యువల్ చేసుకున్నా రుణమాఫీ వస్తుందని అన్నారు. రుణాలు తీసుకున్న  రైతులు,లబ్ధిదారులు రుణాలు సకాలంలో తిరిగి చెల్లించాలని,రుణాలు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక పురోగతి సాధించాలని అన్నారు. రుణాల రెన్యువల్ పై వ్యవసాయ విస్తరణ అధికారులు రైతులకు అవగాహన కలిగించాలని అన్నారు.రుణం మంజూరు చేసినప్పటికీ గ్రౌండింగ్ కాక లబ్ధిదారులు బ్యాంకు లకు వస్తారని,బ్యాంక్ అధికారులు వారి  సమస్యలు పరిష్కరించాలని, సబ్సిడీ మంజూరు చేసి గ్రౌండింగ్ చేయాలని అన్నారు.
  మహిళలు ఆర్థికంగా  ఉన్నతస్థాయికి చేరుకునేలా  ప్రభుత్వం అందించే  స్వశక్తి సంఘాల రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ అన్నారు.  గ్రామీణ ప్రాంతంలో  మహిళా సంఘాలకు  రుణ లక్ష్యం  చేరుకోవాలని,మహిళ సంఘాల రుణాల లక్ష్య  సాధన కోసం ప్రణాళికాబ్దంగా పనిచేయాలని , ప్రతి మాసం లక్ష్యాలను సాధించాలని  కలెక్టర్  అన్నారు.
  ఎస్సి కార్పోరేషన్ రుణాలపై సమీక్షిస్తూ  2017-18,2018-19  సంవత్సరాలకు పెండింగ్   యూనిట్ల  సంబంధించి ప్రభుత్వం సబ్సీడి విడుదల చేసి  రుణాలు మంజూరు చేసి   యూనిట్లను అక్టోబర్  చివరి నాటికి  గ్రౌండ్ చేసేలా  బ్యాంకర్లు  అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.
యువతకు ఉపాధి అందించే విషయంలో అధికారులు చొరవ చుపాలని కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. యువతకు స్వయం ఉపాధి పెంపొందించడానికి, ప్రధాన మంత్రి ఉపాధి కల్పన,ముద్రా రుణాలు,స్టాండ్ ఆప్ ఇండియా కింద బ్యాంక్ ల వారీగా సమీక్షించి లక్ష్యం చేరుకోవాలని అన్నారు .
జిల్లాలో  ఆర్థిక అక్షరాస్యత   పెంపొందించడానికి  బ్యాంకులు  అవసరమైన  చర్యలు తీసుకోవాలని  కలెక్టర్  సూచించారు.  జిల్లాలో ఉన్న బ్యాంకు బ్రాంచీలు  ప్రతి మాసం తప్పనిసరిగా 1 రోజు ఆర్థిక అక్షరాస్యత   పెంపొందించే  ప్రత్యేక అవగాహన క్యాంపు నిర్వహించాలని  కలెక్టర్ ఆదేశించారు.  ఆత్మనిర్భర్ భారత్  కింద జిల్లాలో చిన్న మరియు సూక్ష్మ పరిశ్రమలకు   సహకారం అందించాలని అన్నారు
జల్లాలో స్వశక్తి మహిళా సంఘాలకు అందిస్తున్న రుణాలు మరియు మెప్మా కింద పట్టణాలోని మహిళా సంఘాలకు అందిస్తున్న  రుణాలను ,  వీధి వ్యాపారులకు అందించే రుణాలను  తిరిగి చెల్లించే విధంగా  డిఆర్డిఎ మరియు మెప్మా అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు. సమావేశం లో లీడ్ బ్యాంకు మేనేజరు సూర్యం, ఆర్బీఐ  ఎజిఎం శరత్ చందు, ఎస్.బి.ఐ ఏ.జి.యం విజయ్ కుమార్,నాబార్డ్ ఏ.జి.యం.వినయ్ కుమార్, వివిధ బ్యాంకు కంట్రోలర్లు, మేనేజర్లు , మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు, తదితరులు  ఈ సమీక్షలో పాల్గోన్నారు.
–—–/////////————-
సహాయ సంచాలకులు,సమాచార పౌర సంబంధాల శాఖ, నల్గొండ జారీచేయనైనది

Share This Post