ప్రభుత్వ లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రభుత్వ లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం-1                                                                                                                                                                                             తేదీ.25.8.2021

ప్రభుత్వ లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల/కొరుట్ల :- జిల్లాలోని బ్యాంకులు ప్రభుత్వ లక్ష్యసాధనకు సహకరించాలని జిల్లా కలెక్టర్ జి.రవి కోరారు. ఎస్సి కార్పోరేషన్ యూనిట్, ప్రధానమంత్రి ఉపాథి కల్పన పథకం, మహిళాసంఘాల ,వీధివ్యాపారుల రుణాలు , దివ్యాంగుల సంక్షేమం , వాణిజ్య బ్యాంకుల పనితీరు సంబంధిత అంశాల పై బుధవారం కోరుట్లలోని ఎంపిడిఒ కార్యాలయంలో నిర్వహించిన జేఎంఎల్బిసి సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గోన్నారు. కోరుట్ల, మెడిపల్లి, కథలాపూర్, రాయికల్ మండలాలకు సంబంధించి వివిధ బ్యాంకుల పనితీరు తదితర అంశాల పై సమీక్షలో కలెక్టర్ చర్చించారు. జిల్లాలో పాడి పశవుల పెంపకంను ప్రోత్సహిస్తు 1416 యూనిట్లు మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. స్వయం ఉపాథి పథకం ద్వారా నిరుద్యోగ యువతి యువకులు ఎస్సి కార్పోరేషన్ ద్వారా పాడి పశువుల పంపిణీ పథకం చేపట్టామని అన్నారు. ధర్మపురి పరిధిలో 22 మంది లబ్దిదారులకు పాడి పశువులను పంపిణీ చేస్తామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 122 ప్రభుత్వ , ప్రైవేట్ గ్రామీణ బ్యాంకులు శాఖలు నిర్వహించబడుతున్నాయని, వీటి ద్వారా 58359 మంది రైతులకు 87.05 కోట్ల పంట రుణాలు, 3232 మంది రైతులకు 84.31కోట్ల టర్మ రుణాలు మంజూరు చేయడం జరిగిందని అధికారులు తెలిపారు.  మహిళా సంఘాలు ఆర్థిక శక్తిగా ఎదిగేలా , నూతన వ్యాపారాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. మహిళా సంఘాలకు అందించే రుణాలకు సంబంధించి ప్రతి మాసం లక్ష్యాలు నిర్థేశించుకొని వాటిని సాధించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మహిళా స్వయం సంఘాలకు ఇప్పటి వరకు 4350 లబ్దిదారులకు 205.28కోట్ల రుణాలు అందించడం జరిగిందని అధికారులు తెలిపారు. ఎస్సి కార్పోరేషన్ రుణాలపై సమీక్షిస్తూ 2018-19 సంవత్సరానికి సంబంధించి 4 మండలాలో 154 యూనిట్ గ్రౌండ్ చేసామని, 39 యూనిట్లు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రభుత్వం లబ్దిదారుల ఎంపిక, యూనిట్ ఎంపిక, సబ్సీడి విడుదల అనంతరం సైతం యూనిట్ గ్రౌండ్ చెయడంలో జరుగుతున్న ఆలస్యం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసారు.  త్వరితగతిన పెండింగ్ ఎస్సి యూనిట్లు గ్రౌండర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన జిల్లాకు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి గారు అదనపు యునిట్లు మంజూరు చేసారని, గతంలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందని, లబ్దిదారులను త్వరగా ఎంపిక చేసి గ్రౌండ్ చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుత సంవత్సరం మన జిల్లాలో 1890 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చెసిందని, దీనికి సంబంధించి ప్రతి బ్యాంకుకు లక్ష్యాలను నిర్థేశించామని అధికారులు తెలిపారు. లబ్దిదారుల ఎంపిక పూర్తి చేసి బ్యాంకులకు సమాచారం అందిస్తామని, ప్రభుత్వం సబ్సీడి అందించిన వెంటనే యూనిట్లు గ్రౌండ్ చేసే విధంగా సహకరించాలని కలెక్టర్ బ్యాంకర్లను కోరారు. 2019-20 సంబంధించి పెండింగ్ లో ఉన్న ఎస్సి యూనిట్లు వారం రోజులో గ్రౌండ్ చెసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.  చిన్న పరిశ్రమలను అభివృద్ది చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించిన పథకాలను వినియోగించుకుంటూ వీలైనంత మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధానమంత్రి ఉపాథి కల్పన పథకం కింద 86 ప్రాజేక్టులకు రుణాలు అందించడం లక్ష్యమని, వీటిని త్వరగా అందించేలా చుడాలని అన్నారు. జిల్లాలో 2238 నూతన మైక్రో వ్యపార యూనిట్ల ఏర్పాటకు అవకాశాలు గుర్తించి, 1907 సంస్థలకు రుణాలు మంజూరు చేసామని, 1771 గ్రౌండ్ అయ్యాయని అధికారులు తెలిపారు. మిగిలిన లబ్దిదారులకు సైతం గ్రౌండ్ చెసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రధానమంత్రి మైక్రో పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కింద 22 యూనిట్ల ఏర్పాటుకు దరఖాస్తు వచ్చాయని, వీటిని పరిశీలించి త్వరితగతిన మంజూరు చేయాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో లీడ్ బ్యాంక్ మేనేజర్, ఆర్.డి.ఓ. కొరుట్ల, పి.డి.డి.ఆర్ డి.ఓ.,ఈ. డి. ఎస్సీ కార్పొరేషన్ , మున్సిపల్ కమిషనర్ కొరుట్ల, నాలుగు మండలంలోని బ్యాంక్ మేనేజర్లు, ఎం.పి.డి.ఓ.లు, తదితరులు పాల్గొన్నారు

జిల్లా పౌర సంబంధాల అధికారి, జగిత్యాలచే జారీచేయనైనది

ప్రభుత్వ లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలి :: జిల్లా కలెక్టర్ జి.రవి

Share This Post