ప్రభుత్వ విద్య మరింత బలోపేతం వైపు ప్రభుత్వం అడుగులు.▪️డ్యుయల్ డెస్క్ లు పంపిణీ చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ప్రచురణార్థం

ప్రభుత్వ కళాశాలలో డ్యుయల్ డెస్క్ లు పంపిణీ.▪️రూ.10లక్షలతో 150 డ్యుయల్ డెస్క్ లు ప్రారంభం.

▪️నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ లక్ష్యం.▪️ప్రభుత్వ విద్య మరింత బలోపేతం వైపు ప్రభుత్వం అడుగులు.▪️డ్యుయల్ డెస్క్ లు పంపిణీ చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం, ఆగస్టు 6:

ఖమ్మం నగరంలోని శాంతి నగర్ ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.10 లక్షలతో సమకూర్చిన 150 డ్యూయల్ డెస్క్ లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శనివారం పంపిణీ చేశారు. ఆచార్యా జయశంకర్ గారి జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తమకు అన్ని వసతులు కల్పించినందుకు కళాశాల పూర్వ విద్యార్ధి, మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లడుతూ,
ఏఎస్ఆర్ కళాశాల పూర్వ విద్యార్థిగా గర్వపడుతున్నానని అన్నారు. ప్రభుత్వ కళాశాలలో నాటి వసతులతో పోల్చుకుంటే నేడు అన్ని వసతులతో విద్యను అందిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. తాను చదువుకున్న ఈ కళాశాలకు తన వంతుగా, తనకు తోచిన రీతిలో ఎప్పుడు ఎదో ఒకటి చేస్తూనే ఉంటానని హామి ఇచ్చారు. పేదలకు కార్పొరేట్ స్ధాయిలో ప్రాధమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్యను అందించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి వివరించారు.
మునుపెన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో సీట్ల కోసం ఎమ్మేల్యేలు, మంత్రులతో సిఫారసు చేసుకునే స్థాయికి ప్రభుత్వ విద్యను తీసుకొచ్చిన ఘనత సిఎం కేసీఅర్ దేనని ఆయన అన్నారు. కోట్ల రూపాయలను వెచ్చించి ప్రతి విద్యార్థికి కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పిస్తూ ప్రతి పేద వాడు కూడా ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత లక్ష్యాలను చేరే విధంగా ప్రభుత్వం సకల సౌకర్యాలను అందిస్తుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాల, కళాశాలలో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని వివరించారు. విద్యా ప్రణాళిక కోసమే ప్రభుత్వం బడ్జెట్ లో ప్రత్యేకంగా నిధులు కేటాయించి విద్యను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుందన్నారు.

ఈ కార్యక్రమంలో నగర మేయర్ పునుకొల్లు నీరజ, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్లు కమర్తపు మురళి, మక్బూల్, కళాశాల ప్రిన్సిపల్ విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Share This Post