ప్రభుత్వ విభాగాధిపతులు తమ శాఖల్లోని జిల్లా స్ధాయి ఉద్యోగులకు సంబంధించిన వర్గీకరణ, సీనియరిటిల జాబితాను సత్వరమే రూపొందించాలని జిల్లా కలక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు.

మంగళవారం నాడు కలక్టర్ కలక్టరేట్ సమవేశమందిరంలో ఉమ్మడి వరంగల్ ఉద్యోగుల విభజన పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలక్టర్ మాట్లాడుతూ ఉద్యోగుల విభజన వివరాలను అదనపు కలెక్టర్ కు సమర్పించాలని అన్నారు.
33 జిల్లాలతో రాష్ట్రపతి ఆమోదించిన కొత్త జోనల్‌ వ్యవస్థ-2018కి అనుగుణంగా ప్రభుత్వం ఈ మార్గదర్శకాలను రూపొందించిందని వారిలో సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకోవాలని తెలిపారు.

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని
ఉద్యోగుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఆయా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు వారికి కేటాయించిన పోస్టులకు అనుగుణంగా విభజన ఉండాలని తెలిపారు. 70 శాతం కంటే ఎక్కువగా సమస్య ఉన్న దివ్యాంగులు, మానసిక దివ్యాంగులైన పిల్లలున్న ఉద్యోగులు, కారుణ్య నియామకాల కింద నియమితులైన వితంతువులు, క్యాన్సర్‌, న్యూరో సర్జరీ, కిడ్నీ, కాలేయ మార్పిడి, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ సంబంధిత ఉద్యోగులకు విభజన సమయంలో ప్రాధాన్యమిస్తారని వివరించారు
సస్పెన్షన్‌, శిక్షణ, సెలవు, ఫారిన్‌ సర్వీస్‌, డిప్యుటేషన్‌లలో ఉన్నవారిని కూడా జాబితాలో చేర్చాలని ఆదేశించారు.

పాత జిల్లాల్లోని ఉద్యోగులు ప్రాధాన్య క్రమంలో ఇచ్చే ఆప్షన్ల వారీగా వారిని ఉమ్మడి జిల్లాలోని కొత్త జిల్లాలకు కేటాయిస్తారని అన్నారు. జిల్లా స్ధాయి పోస్ట్ ల విభజన అనంతరం జోనల్, మల్టీ జోనల్ పోస్ట్ ల వివరాలు కూడా సిద్ధం చేసుకోవాలని సూచించారు. జాబితాల ను పూర్తీ పారదర్శకంగా రూపొందించాలని అన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ ఓ వాసుచంద్ర, డీఆర్డీఓ శ్రీనివాస్ కుమార్, సీఈఓ వెంకటేశ్వర రావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post