ప్రభుత్వ వైద్య శిభిరాల సేవలను ప్రజలు సద్వినియోగపర్చుకొని రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన వైద్య సేవలు పొందాలని ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పోరేట్. స్థాయి అత్యాధునిక వైద్యసేవలు అందించడం జరుగుచున్నదని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తెలిపారు.

ప్రచురణార్ధం

ఏప్రిల్ 21 ఖమ్మం –

ప్రభుత్వ వైద్య శిభిరాల సేవలను ప్రజలు సద్వినియోగపర్చుకొని రోగనిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన వైద్య సేవలు పొందాలని ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పోరేట్. స్థాయి అత్యాధునిక వైద్యసేవలు అందించడం జరుగుచున్నదని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ తెలిపారు. గురువారం మధిర పట్టణంలో మెగా వైద్య శిభిరంరాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయివేటు ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వైద్య పరికరాలు, నిపుణులైన వైదాధికారులతో మెరుగైన వైద్యసేవలను ప్రజలకు అందుబాటులోకి తేవడం జరిగిందని కలెక్టర్ అన్నారు. ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నూతనంగా గుండె శస్త్రచికిత్సలు సంబంధించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వైద్య పరికారాలను సమకూర్చుకోవడం జరిగిందని, రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులలో హైద్రాబాదు తరువాత మన ఖమ్మం జిల్లాలోనే క్యాథ్ ల్యాబ్ సౌకర్యం కల్పించడం. జరిగిందన్నారు. క్యాథా ల్యాబ్ ద్వారా గుండెకు స్టంట్ వేసే సౌకర్యం కల్పించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అన్ని సదుపాయాలు కల్గి ఉన్నందున మన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మెడికల్ కళాశాల కూడా మంజూరు. కావడం జరిగిందన్నారు. తెలంగాణ డయాగ్నస్టిక్ హబ్ ద్వారా 50 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేయించి తగు వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. అన్ని రకాల వైద్య సేవలు, శస్త్ర చికిత్సలు చేసే సౌకర్యాలు, ఆయా విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు మన ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఉన్నారని కలెక్టర్ తెలిపారు. గుండెకు సంబంధించి వ్యాధులను నిర్ధారించుకునేందుకు గాను మధిర, సత్తుపల్లి, కల్లూరు, తిరుమలాయపాలెం ఇతర ప్రభుత్వ ఆసుపత్రులలో ఈ.సి.జి. గుండెకు సంబంధించిన వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి రిపోర్టు సంబంధిత వైద్యులకు చేరడం జరుగుతుందని రిపోర్టులో ఏమైన తేడా అనిపించిన వెంటనే ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి పంపించడం జరుగుతుందని తదుపరి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి ఏదైనా అవసరమయిన యెడల స్టంట్ వేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అవసరమైన వైద్య సేవలు సద్వినియోగపర్చుకొని ప్రయివేటు ఆసుపత్రులకు వెల్లి ఆర్ధికంగా నష్టపోవద్దని కలెక్టర్ తెలిపారు. ప్రయివేటు పార్మసీలలో ఉండే అన్ని ఔషదాలు ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్నాయని పేరు మార్పు తప్ప ఒకే విధమైన మెడిసిన్ ఉంటుందని ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ముఖ్యంగా సాధారణ ప్రసవాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించు కొవాలన్నారు. సాధారణ ప్రసవాల వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారని బిడ్డ ప్రసం అయిన వెంటనే తల్లి పాలు పట్టించడం వల్ల బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుందని, సీజరియన్ ప్రసవం వల్ల ఆర్ధిక పరంగా ఆరోగ్య పరంగా తల్లి బిడ్డ ఇబ్బందులకు గురి అవుతారని, ప్రభుత్వ ఆసుపత్రులలో వంద శాతం సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఎనిమిది మంది గైనకాలజిస్టులు అందుబాటులో ఉన్నారని జిల్లా ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రుల వైద్య సేవలను సద్వినియోగపర్చుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.

జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, మున్సిపల్ చైర్ పర్సన్ యం. లత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా॥మాలతీ, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా॥బి. వెంకటేశ్వర్లు, ఎం.పి.పి. లలిత మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ కోటేశ్వరరావు, వైద్యాధికారులు డా|| సుబ్బారావు, డా॥ సైదులు, డా॥పుష్పలత, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Share This Post