ప్రభుత్వ వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం—-2

తేదీ.7.6.2022

ప్రచురణార్థం----2 తేదీ.7.6.2022 ప్రభుత్వ వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి జగిత్యాల జూన్ 7:- ప్రజల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవి కోరారు. మంగళవారం జిల్లాలో నూతనంగా ప్రారంభించిన 100 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.  మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో ఉన్న రోగులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సరఫరా సమస్య పరిష్కారానికి వారం రోజుల్లో ఆర్వో ప్లాంట్ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఆస్పత్రి నిర్వహణ సంతృప్తికరంగా ఉందని కలెక్టర్ వైద్యాధికారులను అభినందించారు. ఆస్పత్రి పరిసరాలలో పారిశుద్ధ్య పకడ్బందీగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.  ప్రైవేట్ ఆస్పత్రికి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని, ప్రజలు వాటిని వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.  జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, వైద్యులు, సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.
ప్రభుత్వ వైద్య సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి:: జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల జూన్ 7:- ప్రజల కోసం ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జి.రవి కోరారు. మంగళవారం జిల్లాలో నూతనంగా ప్రారంభించిన 100 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిలో ఉన్న రోగులతో కలెక్టర్ మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సరఫరా సమస్య పరిష్కారానికి వారం రోజుల్లో ఆర్వో ప్లాంట్ ఆసుపత్రిలో ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు.

ఆస్పత్రి నిర్వహణ సంతృప్తికరంగా ఉందని కలెక్టర్ వైద్యాధికారులను అభినందించారు. ఆస్పత్రి పరిసరాలలో పారిశుద్ధ్య పకడ్బందీగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

ప్రైవేట్ ఆస్పత్రికి దీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించామని, ప్రజలు వాటిని వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, వైద్యులు, సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.

Share This Post