జిల్లా లో చేపడుతున్న ప్రభుత్వ సంక్షేమ శాఖల పథకాలు, స్వయం ఉపాధి యూనిట్ లు, వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ అర్హులైన లబ్దిదారులకు సకాలంలో రుణాలు అందించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా బ్యాంకు అధికారులను ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి బ్యాంకర్ల సమీక్షా సమావేశం నిర్వహించి, 2022-23 వార్షిక లక్ష్యాలు, ఇప్పటి వరకూ సాధించిన ప్రగతి పై జిల్లా అదనపు కలెక్టర్ బ్యాంకర్ లతో సమీక్షించారు.
అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాలలో ఉండే ప్రజలకు లబ్ది దారులకు అందించే రుణ పథకాలపై పూర్తిగా అవగాహన కలిపించి , అర్హులైన లబ్దిదారులకు రుణాలు అందించాలని, బ్యాంక్ కు వచ్చే వివిధ శాఖల లబ్ది దారులకు సంబంధిత శాఖల సమన్వయంతో ప్రభుత్వ ద్వారా అందిస్తున్న సంక్షేమ పథకాలు,స్వయం ఉపాధి సంబందించి పెండింగ్ గ్రౌండింగ్ చేయాలని,ఎస్.హెచ్ జి గ్రూప్ లకు రుణ సదుపాయం కల్పించాలని బ్యాంకర్లను కోరారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్న రుణ మంజూరు లక్ష సాధన ఆశించిన మేర లేదని జిల్లా అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో నిర్దేశించిన లక్ష్యాలను జిల్లాలో అమలు చేయాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణిత వ్యవధిలోగా గ్రౌండింగ్ చేయాల్సిన బాధ్యత బ్యాంకు అధికారులదేనని, బ్యాంకు లు ఇచ్చే సబ్సిడీల పై లబ్దిదారులకు అవగాహన కల్పించాలని అన్నారు. సంక్షేమ శాఖాధికారులు వారికీ నిర్దేశించిన బ్యాంకులలో పెండింగ్లో ఉన్న, గ్రౌండింగ్ కానీ యూనిట్లను పరిష్కరించేందుకు గాను బ్యాంకు అధికారులను తరచుగా సంప్రదిస్తూ గ్రౌండింగ్ పూర్తీ చేయాలన్నారు జిల్లా పరిశ్రమల కేంద్రం జి.యం.కోటేశ్వర రావు మాట్లాడుతూ.పి.యం.ఫార్మలైజేశన్ మైక్రో పుడ్ ప్రాసెసింగ్ పథకం కింద ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్ మైక్రో యూనిట్ ల ఏర్పాటుకు జిల్లా పరిశ్రమల కేంద్రం నుండి 232 దరఖాస్తులు ముఖ్యంగా స్వయం సహయ సంఘాల మహిళలు లబ్దిదారులు ఎంపిక చేసిన వాటిని బ్యాంకు లకు రుణ మంజూరీ కి పంపడం జరిగిందని,ఆయా బ్యాంక్ అధికారులు మంజూరు చేయాలని కోరారు
రుణాల మంజూరు తో పాటు రుణ రికవరీ లపై కూడా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. జిల్లా పరిశ్రమల శాఖ,వ్యవసాయ శాఖ, మెప్మా అధికారులు రిసోర్సు పర్సనల్ సహాయంతో రుణగ్రహితలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి రుణ చెల్లింపుల ప్రాధాన్యతను వివరించి రికవరీల శాతం పెంచేందుకు కృషి చేయాలన్నారు.
సమావేశం ప్రారంభం కు ముందు ఎల్ డి.ఎం టి. శ్రామిక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో వార్షిక రుణప్రణాళిక లక్ష్యాలు సాధింపులు ప్రగతిని వివరించారు.
ఈ సమావేశంలో ఎల్.డి. ఎం టి. శ్రామిక్, నాబార్డ్ డి.డి.యం వినయ్,అర్.బి. ఐ.లీడ్ డిస్ట్రిక్ట్ అధికారి సాయి చరణ్, వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లు, తదితరులు పాల్గొన్నారు. ——