ప్రెస్ రిలీజ్. తేది06.08.2021 ప్రభుత్వ స్థలాలు ఉంటే మండలానికి 2 బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ స్థలాలను తహసీల్దార్లు గుర్తించాలని కోరారు. రెవెన్యూకు సంబంధించిన ఫైల్స్ పెండింగ్లో ఉండకుండా చూడాలని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఏవో రవీందర్, ఆర్ డి వో లు శీను, రాజా గౌడ్ సూపరిండెంట్ లు నారాయణ, రంజిత్ కుమార్, ఉమలత, సరళ, సప్న, సువర్ణ పాల్గొన్నారు. Dpro..Kamareddy.