ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే…

ప్రచురణార్ధం

ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు తొలగించాల్సిందే…

మహబూబాబాద్, డిసెంబర్,07.

ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాల తొలగించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు

మంగళవారం కలెక్టర్ కార్యాలయ ప్రజ్ఞ సమావేశ మందిరంలో మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై జిల్లా ఎస్పీ తో కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టి.ఎస్.బి.పాస్ అనుమతులు లేని అక్రమ కట్టడాలను తక్షణం తొలగించాలని జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ అధికారులను ఆదేశించారు. పోలీస్, రెవిన్యూ, మున్సిపల్ అధికారులు సమిష్టిగా నిర్ణయాలు తీసుకొని పక్కాగా స్వాధీనపరచుకోవాలన్నారు.

అక్రమ కట్టడాలు తొలగించడమే కాదని పరిరక్షించుకునే చర్యలు వెంటనే చేపట్టాలన్నారు.

5ఎకరాలు పైగా ఉన్న స్థలాలకు శాశ్వతంగా రక్షణ ఏర్పాటు చేయాలన్నారు. హద్దులతో మార్కింగ్ చేస్తూ, వీడియో చిత్రీకరణ, ఫోటోలు తీయించడం చేయాలన్నారు.

5 ఎకరాల లోపు స్థలాలకు వీడియో చిత్రీకరణ, ఫోటోలు తీయించి బయో ఫెన్సింగ్ చేయించాలని బోర్డ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు.

ఈ జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశంలో జిల్లా ఎస్పీ కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, మున్సిపల్, రెవిన్యూ, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
———–
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది

Share This Post