ప్రభుత్వ స్థలాల సంరక్షణకై సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్. అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

నవంబరు 03, ఖమ్మం

ప్రభుత్వ స్థలాల సంరక్షణకై సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్. అధికారులను ఆదేశించారు. బుధవారం ఖమ్మం అర్బన్ మండల పరిధిలో గల ప్రభుత్వ స్థలాలను నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలిసి కలెక్టర్ పరిశీలించారు. నగరంలోని బుర్హాన్.పురం, ఎన్.ఎస్.పి క్యాంప్, బి.సి భవన్, వీడియోస్ కాలనీ, బల్లేపల్లి ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాలను కలెక్టర్ తణిఖీ చేసారు. ఇప్పటికే గుర్తించిన ప్రభుత్వ స్థలాలకు సరిహద్దులు నిర్ధారించాలని, ఇంకముందు ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రెవెన్యూ యంత్రాంగాన్ని కలెక్టర్ ఆదేశించారు. బుర్హాన్.పురం ప్రాంతంలోని ప్రభుత్వ స్థలంలో నగరపాలక సంస్థ ద్వారా పట్టణ ప్రకృతివనాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ భూములకు సంబంధించి పెండింగ్లో ఉన్న కోర్టు కేసుల పరిష్కారానికై తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ తవ్వకాలపై తగు చర్యలు తీసుకొని అట్టి భూములను వినియోగంలోకి తేవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఇప్పటికే చేపట్టిన ప్రభుత్వ భవనాల నిర్మాణపు పనులను మరింత వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ స్థలాల విస్తీర్ణాన్ని రికార్డుల ప్రకారం సర్వేజరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాథ్, ల్యాండ్ సర్వే ఏ.డి రాము, పంచాయితీరాజ్, రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చంద్రమౌళి, శ్యాంప్రసాద్, అర్బన్ తహశీల్దారు శైలజ, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post