ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలి :: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

ప్రచురణార్థం-1
జనగామ, డిసెంబర్ 24:
ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ జిల్లా స్థాయి రోడ్డు భద్రత కమిటీ సమావేశాన్ని డిసిపి బి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న జాతీయ రహాదారి పై ప్రమాదాల నివారణకు జాతీయ రహదారీ సంస్థ, రహదారులు మరియు భవనాల శాఖ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ, పోలీస్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. జాతీయ రహదారి వెంబడి అవసరమైన చోట అండర్ పాస్ లు, డివైడర్స్, విషయ సూచికలు, స్పీడ్ బ్రేకర్స్, స్పీడ్ లిమిట్స్, ట్రక్ లే అవుట్స్, సిగ్నల్ లైట్స్ , జీబ్రా క్రాసింగ్స్ తదితర పనులను క్షేత్ర స్థాయిలో బృందం గా వెళ్లి పరిశీలించి ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాలలో రోడ్డు క్రాసింగ్, రాంగ్ రూట్ నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించాలని, మైనర్ డ్రైవింగ్, రాత్రి వేళల్లో మద్యపానం సేవించి వాహనాలు నడపకుండా తనిఖీలు నిర్వహించాలని అన్నారు. రహదారుల వెంట ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణనష్టం నివారణకు సమీపంలో వైద్య బృందాలు,108 వాహనాలు, సిద్దంగా ఉండే విధంగా ప్రణాళిక రూపొందించాలని అన్నారు.
ఈ సమావేశంలో జిల్లా మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ శోభన్ బాబు, మునిసిపల్ కమిషనర్ నరసింహా, ఆర్&బి ఈఈ హుస్సేన్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. పి. సుగుణాకర్ రాజు, జాతీయ రహదారి సిబ్బంది కృష్ణమోహన్, వేణుగోపాల్, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post