ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో ఘనంగా జరిగాయి

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయంలో ఘనంగా జరిగాయి.
వారి చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి,  జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దీపక్ తివారి,  జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కొండా లక్ష్మణ్ బాపూజీ వారి అభివృద్ధికి నిరంతరం కృషి చేశారని జిల్లా కలెక్టర్ కొనియాడారు.
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి యాదయ్య,  కలెక్టరేట్ ఏవో నాగేశ్వరా చారి, అధికారులు, బలహీన వర్గాల సంఘాల ప్రతినిధులు రాజు,  తదితరులు పాల్గొన్నారు.

Share This Post