ప్రవేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యాబోధన ……

ప్రచురణార్థం-
తోర్రుర్/మహబూబాబాద్ 08 నవంబర్2021.

ప్రవేట్ కళాశాలకు దీటుగా ప్రభుత్వ కళాశాలల్లో విద్యాబోధనతో పాటు వనరులు వసతులు కల్పిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
సోమవారం మధ్యాహ్నం తోర్రుర్ డివిజన్ కేంద్రంలో 3 కోట్ల90 లక్షల వేయంతో 2 1/2 ఎకరాల్లో నిర్మించిన నూతన డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవం మంత్రి, జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి ప్రారంభించారు.
జ్యోతి ప్రజ్వలన గావించి ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2008-09 లో తొర్రూర్ లో డిగ్రీ కళాశాల ప్రారంభం అయిందని, కళాశాల లేక విద్యార్థులు ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడ్డారని, గత 5 సంవత్సరాలుగా సొంత భవన నిర్మాణ కోసం గేల్ వారికి ప్రతిపాదనలు పంపించడం జరిగిందని, మంజూరు చేసిన CSR నిధుల తో ప్రత్యక్ష0గా పూర్తి దశల్లో నిర్మించుకొని నేడు ప్రారంభించుకోవడం సంతోషమని, ఈ ప్రాంతం వారు రుణపడి ఉంటామని, గేల్ వారుకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూన్నానని మంత్రి అన్నారు.
గతంలో కనీస వసతులు లేక, చదవాలంటే సుదీర్ఘ ప్రాంతాలకు వెళ్లేవారని రూమ్ కిరాయిలు కట్టలేక , సుదీర్ఘ ప్రాంతం వెళ్ళలేక అనేకమంది విద్యకు దూరమయ్యారని, అన్నారు.కళాశాల అభివృద్ధికి ప్రతి ఉపాధ్యాయులు విశిష్ట కృషి చెయ్యాలని, విద్యార్ధిని,విద్యార్థులు ఈ సదుపాయాలను, వసతులను సద్వినియోగం చేసుకోవాలని, ఈ ప్రాంతం విద్యారంగంలో మంచి ఫలితాలు సాధించాలని, చక్కటి భవిష్యత్తును నిర్దేశించుకోవాలి, ఉపాధ్యాయులు విద్యార్థులు సమయాభావం పాటించాలని, చదువుతోపాటు క్రీడారంగంలో, కళా నైపుణ్యాలను, దేశ రాష్ట్ర జిల్లాలో ఉత్తమ ప్రతిమలు కనపరుస్తూ కళాశాలకు కన్న తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని అన్నారు. క్రీడా మైదానం అభివృద్ధికి, ఆట పరికరాలకు, సైన్స్ ల్యాబ్ లకు, ఫర్నిచర్ ను అందించేందుకు తను కృషి చేస్తానని మంత్రి దయాకర్ రావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్, డి పి ఓ సాయి బాబా, మున్సిపల్ చైర్ పర్సన్ రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు, ఎంపీపీ అంజయ్య, జెడ్ పి టి సి శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, గేల్ జోనల్ మేనేజర్ శరత్ త్రీపాఠి, సీనియర్ మేనేజర్ బాలాజీ కుమారస్వామి ఆర్డిఓ రమేష్ బాబు, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ నాగమణి, ఎంపీడీవో భారతి, ఎం పీ ఓ గౌస్, కళాశాల ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్ 5వ వార్డు సునీత, వార్డ్ కౌన్సిలర్ లు E x ఎంపీపీ కర్ర సోమయ్య , అభివృద్ధి కమిటీ చైర్మన్ పొనుగోటి సోమేశ్వర రావు, గాంధీ నాయక్, కళాశాల స్టాప్, ప్రజాప్రతినిధులు, కళాశాలల ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి కార్యాలయం మహబూబాబాద్ గారిచే జారీ చేయడమైనది

Share This Post