ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు నిర్వహణ:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం—1

తేదీ.6.5.2022

ప్రచురణార్థం---1  తేదీ.6.5.2022  ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు నిర్వహణ:: జిల్లా కలెక్టర్ జి.రవి  జగిత్యాల మే 6:- జిల్లాలో ఇంటర్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జి.రవి తెలిపారు.  ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు ప్రారంభమైన నేపధ్యంలో కలెక్టర్ శుక్రవారం జగిత్యాల లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మరియు శాంతి ఓకేషనల్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించారు.  మే 6,2022 నుంచి మే 24,2022 వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకోసం 30 పరీక్ష కేంద్రాలు సన్నద్ధం చేశామని, ఈ రోజు ఇంటర్ మొదటి సం.కు గాను 8917 విద్యార్థులకు గాను 8473 మంది హాజరైనరని తెలిపారు.  కరోనా కారణంగా గత 2 సంవత్సరాలుగా పరీక్షలు నిర్వహించ లేదని, ప్రస్తుత సంవత్సరం విద్యార్థులకు అవసరమైన సమయం అందించి, కేవలం 70% సీలబస్ తో ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తుందని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు 50% ఆప్షన్ ఉండే విధంగా ప్రభుత్వం ప్రశ్నపత్రం తయారుచేయబడినదని , ఎలాంటి ఒత్తిడి లేకుండా విద్యార్థులు పరీక్షలు రాయాలని కలెక్టర్ సూచించారు.  ఇంటర్ పరీక్షల నిర్వహణలో ప్రశ్న పత్రం లీకెజి, మాస్ కాపీ జరగకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు తరగతి లోకి త్రాగు నీరు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.  జగిత్యాల ఆర్.డి.ఓ. శ్రీమతి ఆర్.డి.మాధురి,  ఇంటర్ నోడల్ అధికారి నారాయణ, ఇతర సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.
ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు నిర్వహణ:: జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల మే 6:- జిల్లాలో ఇంటర్ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జి.రవి తెలిపారు. ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు ప్రారంభమైన నేపధ్యంలో కలెక్టర్ శుక్రవారం జగిత్యాల లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల మరియు శాంతి ఓకేషనల్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను సందర్శించారు.

మే 6,2022 నుంచి మే 24,2022 వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకోసం 30 పరీక్ష కేంద్రాలు సన్నద్ధం చేశామని, ఈ రోజు ఇంటర్ మొదటి సం.కు గాను 8917 విద్యార్థులకు గాను 8473 మంది హాజరైనరని తెలిపారు.

కరోనా కారణంగా గత 2 సంవత్సరాలుగా పరీక్షలు నిర్వహించ లేదని, ప్రస్తుత సంవత్సరం విద్యార్థులకు అవసరమైన సమయం అందించి, కేవలం 70% సీలబస్ తో ప్రభుత్వం పరీక్షలు నిర్వహిస్తుందని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులకు 50% ఆప్షన్ ఉండే విధంగా ప్రభుత్వం ప్రశ్నపత్రం తయారుచేయబడినదని , ఎలాంటి ఒత్తిడి లేకుండా విద్యార్థులు పరీక్షలు రాయాలని కలెక్టర్ సూచించారు.

ఇంటర్ పరీక్షల నిర్వహణలో ప్రశ్న పత్రం లీకెజి, మాస్ కాపీ జరగకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టామని కలెక్టర్ తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని అన్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని విద్యార్థులకు తరగతి లోకి త్రాగు నీరు అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

జగిత్యాల ఆర్.డి.ఓ. శ్రీమతి ఆర్.డి.మాధురి, ఇంటర్ నోడల్ అధికారి నారాయణ, ఇతర సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.

Share This Post