ప్రశాంతంగా న్యూ హౌసింగ్ బోర్డు ప్లాట్ల వేలం ప్రక్రియ

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ లో గల ప్రగతి భవన్ లో గురువారం కలెక్టర్ సి.నారాయణరెడ్డి నేతృత్వంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో కంటేశ్వర్ న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ ప్లాట్ల వేలంపాట ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. వాణిజ్యపరమైన విభాగంలో రెండు ప్లాట్లు, నివాస యోగ్యం కలిగిన 19 ప్లాట్ల కోసం ముందస్తుగా లక్ష రూపాయల చొప్పున ఈ ఎం డిలు చెల్లించిన ఔత్సాహిక బిడ్డర్లు వేలం పాటలో పాల్గొన్నారు. ఒక్కో ప్లాట్ వారీగా అధికారులు నిబంధనలను అనుసరిస్తూ వేలం ప్రక్రియను నిర్వహించారు. ఈ సందర్భంగా బిడ్డర్లు వేలంలో పోటీ పడగా, అధిక ధర పలికిన బిడ్డర్ ను ఖరారు చేశారు. గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కు వేలంపాట వివరాలు పంపిస్తామని, అక్కడి నుండి అనుమతి వచ్చిన తరువాత ప్రస్తుత వేలంపాటలో ఖరారైన బిడ్డర్ కు ప్లాట్ ను కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. వేలం ప్రక్రియలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, హౌసింగ్ ఈ.ఈ బాల్ నాయక్, అదనపు ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్ రావు తదితరులు పాల్గొన్నారు.
—————–

Share This Post