ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు – డీఈఓ రమేష్

బుధవారం జరిగిన పదవ తరగతి తృతీయ భాష పరీక్ష ప్రశాంతంగా జరిగిందని జిల్లా విద్యాశాఖాధికారి రమేష్ కుమార్ తెలిపారు. ఇట్టి పరీక్షకు 11,394 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 11,271 విద్యార్థులు అనగా 98.92 శాతం హాజరయ్యారని , 123 మంది విద్యార్థులు గైర్హాజర్ అయ్యారని ఆయన తెలిపారు. కాగా ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు ఎల్దుర్తి, శివంపేట్, నారింజ, పాపన్నపేట, కౌడిపల్లి ప్రాంతాలలో 18 , చేగుంట 5 పరీక్షా కేంద్రాలను పరిశీలించాలని ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేవని, అన్నారు.

Share This Post