*ప్రశాంతంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా కార్యక్రమం : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

*ప్రశాంతంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా కార్యక్రమం : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 20: జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపు లక్కీ డ్రా కార్యక్రమం ప్రశాంతంగా పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో అబ్కారీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మద్యం దుకాణాల లక్కీ డ్రా కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో మొత్తం 48 మద్యం దుకాణాలకు గానూ, 900 దరఖాస్తులు వచ్చాయని, ప్రభుత్వ నిబంధనల మేరకు దరఖాస్తులు తక్కువగా ఉన్న కారణంగా కోనరావుపేట మండలం నిమ్మపెల్లి, రుద్రంగి లో ఉన్న మద్యం దుకాణాలకు డ్రా తాత్కాలికంగా నిలిపివేయడం జరిగిందని తెలిపారు. శనివారం మొత్తం 46 మద్యం దుకాణాలకు గాను లక్కీ డ్రా నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ డిసెంబర్, 1 వ తేదీ నుండి మద్యం దుకాణాలు దక్కించుకున్న అభ్యర్థుల గడువు మొదలై రెండు సంవత్సరాల పాటు ఉంటుందని తెలిపారు. ఈ లక్కీ డ్రా కార్యక్రమం దరఖాస్తుదారుల సమక్షంలో పూర్తిగా పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని, ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియోగ్రఫీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కాగా అబ్కారీ శాఖ అధికారులు ఈ కార్యక్రమ నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఒక విడతలో 5 దుకాణాల అభ్యర్థులను సమావేశ మందిరంలోకి అనుమతిస్తూ, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టారు. ప్రత్యేక వైద్య శిబిరం, అంబులెన్స్, ఫైర్ ఇంజన్, మొబైల్ టాయిలెట్లను అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్య ప్రసాద్, ప్రత్యేకాధికారి ప్రదీప్ రావు, సీఐ లు ఎంపీఆర్. చంద్రశేఖర్, జి.రాము, ఎస్సైలు శ్రీనివాస్, స్వరూప, కిషన్, శేఖర్, రాజేందర్,శ్రీకాంత్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post