*ప్రశాంతంగా ముగిసిన మేడారం జాతర. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య*

**వార్త ప్రచురణ
తేదీ.20.02.2022(ఆదివారం)
మేడారం**

*ప్రశాంతంగా ముగిసిన మేడారం జాతర. జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య*

మేడారం జాతర 2022 ను విజయవంతంగా ముగిసినందుకు సహకరించిన ప్రజలు ,ప్రజా ప్రతినిదులు, అధికార యంత్రాంగం కి, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియ వారికి పేరు పేరున జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య కృతజ్ఞతలు తెలిపారు.

మేడారం జాతర ముగింపు సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఆదివారం ప్రభుత్వ సెలవు దినం రోజున భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అట్టి ఏర్పాట్ల పై అధికార యంత్రాంగం నిమగ్నమవ్వాలని జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం మేడారం విధుల నుండి ఆదివారం విడుదల ఐయ్యారు.

మేడారం జాతర ముగింపు కార్యక్రమాలలో భాగంగా శానిటేషన్ వర్కర్స్ పని తీరును డ్రోన్ కెమెరా ద్వారా పరిశీలించారు. జాతర ముగిసినప్పటికీ ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తులు జంపన్న వాగు లో భక్తులు స్నానాలు చేసి అమ్మవార్లను దర్శించుకున్నారని కలెక్టర్ అన్నారు. జాతర ముగింపు ఏర్పాట్లలో జిల్లా కలెక్టర్ పర్యవేక్షించి నీటి నిలువలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ బ్లీచింగ్ పౌడర్ చల్లి దోమల నివారణకు దోమల మందులు పిచికారి చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరంట్రైబల్ వెల్ఫేర్ మ్యూజియం ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Share This Post