ప్రశాంతంగా ముగుసిన యల్.యల్.సి. ఎన్నికలు. 97.01 శాతం పోలింగ్. భారీ భద్రతతో పోలింగ్ బాక్సలు నల్గొండకు తరలింపు. :::: జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి.

జిల్లాలోని స్థానిక సంస్థల ఎం.యల్.సి. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి మరియు  కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి అన్నారు.  సోమవారం జిల్లాలోని  6-హుజూర్ నగర్, 7-కోదాడ, 8-సూర్యాపేట పోలింగ్ కేంద్రాలలో  కట్టు దట్టమైన ఏర్పాట్లు చేసి ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉదయం 8.00 ల  నుండి సాయంత్రం 4 .00 ల వరకు ప్రశాంతంగా స్థానిక సంస్థల  యం. యల్.సి  ఎన్నికలు నిర్వహించామని అన్నారు. ఉదయం 10. గంటలకు 4 ఓట్లు నమోదై 0.99 శాతం అలాగే 12.00 గంటలకు 174 ఓట్లు నమోదై  43.28 శాతం అలాగే 2.00 గంటలకు 338 ఓట్లు నమోదై 84.08 శాతం,అలాగే 4.00 గంటలకు మొత్తం 402 ప్రజా ప్రతినిధులకు గాను 390 మంది ప్రజా ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోజించుకున్నారని 97.01 శాతం ఓటింగ్ నమౌదు అయినట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ ఆనంతరం సహాయ రిటర్న్ నింగ్ అధికారి , అదనపు కలెక్టర్ యస్ మోహన్ రావు ఆధ్వర్యంలో
సెక్టోరియల్ , రూట్ అధికారుల సమక్షంలో నల్గొండ కేంద్రం నకు పోలీస్ ఎస్కార్డ్ తో మూడు కేంద్రాల పోలింగ్ బాక్సలు పంపించడం జరిగిందని ఈ సందర్బంగా కలెక్టర్ పేర్కొన్నారు.

Share This Post