ప్రశాంతంగా స్థానిక సంస్థల ఎన్నికలు : జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల, శాసన మండలి సభ్యుల ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. శుక్రవారం జిల్లాలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ లలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రాలను జిల్లా ఎస్‌.పి. అడ్మిన్‌ సుధీంద్రతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల, శాసన మండలి సభ్యుల ఎన్నికలు శుక్రవారం ఉదయం 8 గం॥లకు ప్రారంభమై సాయంత్రం 4 గం.ల వరకు పోలింగ్‌ కొనసాగిందని, జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. జిల్లా ఎస్‌.పి. ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే పోలింగ్‌ కేంద్రంలోనికి అనుమతించేలా సిబ్బందికి ముందస్తుగా సూచించడం జరిగిందని, జిల్లాలోని ఆసిఫాబాద్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రం పరిధిలో 69 మంది ఓటర్లు ఉండగా 67 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, కాగజ్‌నగర్‌ పరిధిలో 96 మంది ఓటర్లు ఉండగా 94 మంది పోలింగ్‌లో పాల్గొన్నారని తెలిపారు. పోలింగ్‌ ముగిసిన అనంతరం బ్యాలెట్‌ బాక్స్‌లను ఏజెంట్ల సమక్షంలో సీల్‌ చేసి (స్టాంగ్‌ రూముకు తరలించినట్లు తెలిపారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post