ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షల నిర్వహణ:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం—1

తేదీ.23.5.2022

ప్రచురణార్థం---1  తేదీ.23.5.2022  ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షల నిర్వహణ:: జిల్లా కలెక్టర్ జి.రవి  జగిత్యాల మే 23:- ప్రశాంత వాతావరణంలో జిల్లాలో 10వ తరగతి పరీక్షలు జరుగు తున్నాయని జిల్లా కలెక్టర్ జి.రవి అన్నారు.  సోమవారం 10వ తరగతి పరీక్షల  ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ ఓల్డ్ హై స్కూల్, ప్రైవేటు ఎ.సి.ఈ పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు.  జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు 11820 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, 67 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసామని కలెక్టర్ అన్నారు.  ప్రతి పరీక్ష కేంద్రం లో కనీసం మందులతోపాటు ఎఎన్ఎం ఏర్పాటు చేశామని, జిల్లాలోని ఒక సీనియర్ అధికారి ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఇంఛార్జిగా నియమించామని కలెక్టర్ తెలిపారు.  జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి 10వ తరగతి విద్యార్థులను  సన్నద్ధం చేశామని కలెక్టర్ అన్నారు.   జిల్లాలో పదవతరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్  నియంత్రించేందుకు ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామని, సీనియర్ అధికారులతో కలిసి ఏర్పాటుచేసిన ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేస్తున్నారని కలెక్టర్ అన్నారు.  జిల్లా వైద్యాధికారి జగన్మోహన్ రెడ్డి , ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.  జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.
ప్రశాంత వాతావరణంలో 10వ తరగతి పరీక్షల నిర్వహణ:: జిల్లా కలెక్టర్ జి.రవి

జగిత్యాల మే 23:- ప్రశాంత వాతావరణంలో జిల్లాలో 10వ తరగతి పరీక్షలు జరుగు తున్నాయని జిల్లా కలెక్టర్ జి.రవి అన్నారు. సోమవారం 10వ తరగతి పరీక్షల ప్రారంభమైన నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ ఓల్డ్ హై స్కూల్, ప్రైవేటు ఎ.సి.ఈ పాఠశాలలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్ష కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు.

జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు 11820 మంది విద్యార్థులు హాజరవుతున్నారని, 67 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామని కలెక్టర్ తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసామని కలెక్టర్ అన్నారు.

ప్రతి పరీక్ష కేంద్రం లో కనీసం మందులతోపాటు ఎఎన్ఎం ఏర్పాటు చేశామని, జిల్లాలోని ఒక సీనియర్ అధికారి ప్రతి పరీక్ష కేంద్రం వద్ద ఇంఛార్జిగా నియమించామని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించి 10వ తరగతి విద్యార్థులను సన్నద్ధం చేశామని కలెక్టర్ అన్నారు.

జిల్లాలో పదవతరగతి పరీక్షల్లో మాస్ కాపీయింగ్ నియంత్రించేందుకు ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశామని, సీనియర్ అధికారులతో కలిసి ఏర్పాటుచేసిన ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు పరీక్ష కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేస్తున్నారని కలెక్టర్ అన్నారు.

జిల్లా వైద్యాధికారి జగన్మోహన్ రెడ్డి , ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.

Share This Post